Begin typing your search above and press return to search.

ఒక్క చాన్స్ అంటున్న లోకేష్

By:  Tupaki Desk   |   6 April 2022 8:07 PM IST
ఒక్క చాన్స్ అంటున్న లోకేష్
X
ఒక్క చాన్స్ అన్నది పవర్ ఫుల్ స్లోగన్ గా మారి ఏపీలో వైసీపీకి బంపర్ మెజారిటీని ఇచ్చేసింది. దాంతో ఒక్క చాన్సే జగన్ కి ఇక అదే లాస్ట్ చాన్స్ అని కూడా విపక్షాలు సెటైర్లు వేస్తూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఒక్క చాన్స్ అన్న నినాదం మాత్రం హైలెట్ గా పాలిటిక్స్ లో అపుడూ ఇపుడూ ఉంది.

అందుకే టీడీపీ భావి వారసుడు, జాతీయ కార్యదర్శి లోకేష్ ఒక్క చాన్స్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఆయన ఒక్క చాన్స్ అంటే అలా ముఖ్యమంత్రిని అయిపోవడానికి కాదు, జస్ట్ ఎమ్మెల్యే కావడానికే. లోకేష్ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు.

తాజాగా మరోమారు మంగళగిరి వెళ్లిన లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఒక్క చాన్స్ ఇవ్వండి, ఎమ్మెల్యేను అవుతాను అని మీడియా ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఒక్క చాన్స్ అని అడిగి జగన్ ఎలా పాలన చేస్తున్నారో చూశారు కదా అని ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అంటే జనాలకు వెగటు పుట్టిందని కూడా విమర్శించారు. ఆ పార్టీ మంత్రులను మార్చినా మరేమి చేసినా కూడా ప్రజలకు జరిగే మేలు ఏదీ లేదని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు.

ఇదిలా ఉంటే లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2017లో ఆయన ఈ పదవికి ఎన్నిక అయ్యారు. అంటే 2023 మార్చి తో ఆయన పదవీ కాలం పూర్తి అవుతుంది. అంటే గట్టిగా పదకొండు నెలలు మాత్రమే ఆయన పెద్దల సభలో ఉంటారన్న మాట. దాంతో ఈసారి అసెంబ్లీ గేట్ ని టచ్ చేసి నేరుగా శాశనసభలోకి రావాలని లోకేష్ చూస్తున్నారు. మరి మంగళరిగి ప్రజలు ఈసారి లోకేష్ మాటను ఆలకిస్తారా. ఆయనకు ఒక్క చాన్స్ ఇస్తారా. వెయిట్ అండ్ సీ.