Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి.. లోకేష్ అభిషేకం.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   22 March 2022 12:18 PM IST
జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి.. లోకేష్ అభిషేకం.. రీజ‌న్ ఇదే!
X
ఏపీ సీఎం జ‌గ‌న్ అంటే.. అంత ఎత్తున ఎగిరి ప‌డే.. టీడీపీ నాయ‌కులు.. తాజాగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి అభిషేకం చేశారు. అయితే.. పాల‌తో కాదు.. మ‌ద్యంతో!! దీనికి కార‌ణం ఏంటంటే.. జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్యంతో అభిషేకం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. 'మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా' అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో కరోనా మరణాలతో పోటీగా నాటుసారా మరణాలు ఉన్నాయని ఆరోపించారు. ఇంకెన్ని సారా చావులు జగన్ రెడ్డి కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. 'మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా' అని నినాదాలు చేశారు.

నాటుసారా, జే-బ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా ఐదోరోజూ లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. నాటుసారా, జే-బ్రాండ్‌తో మద్యంతో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా మరణాలతో పోటీగా నాటుసారా మరణాలు ఉన్నాయని ఆరోపించారు.

ఇంకెన్ని సారా చావులు జగన్ రెడ్డి కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే అన్యాయంగా తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం మరణాలపై న్యాయవిచారణ జరపాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలు సైతం రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా, సీఎం వైఖరిలో మార్పు లేదని దుయ్యబట్టారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీని.. మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. ప్రజాకోర్టులో జగన్ రెడ్డికి శిక్ష తప్పదని లోకేష్ స‌హా నాయ‌కులు హెచ్చరించారు. అయితే.. టీడీపీ నేత‌లు.. మ‌ద్యంతో జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి అభిషేకం చేయ‌డం సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారింది. దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.