Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సాక్షిగా టీడీపీలో బయటపడ్డ విభేదాలు

By:  Tupaki Desk   |   16 Jun 2020 5:00 PM IST
అసెంబ్లీ సాక్షిగా టీడీపీలో బయటపడ్డ విభేదాలు
X
అసెంబ్లీ సాక్షిగా టీడీపీకి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. శాసన మండలిలో టీడీపీ సభ్యుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీకి తాజాగా రాజీనామా చేసి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కేఈ ప్రభాకర్ వైఖరి హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఆందోళనలు, నిరసనలకు కేఈ దూరంగా ఉన్నారు. తోటీ టీడీపీ ఎమ్మెల్సీలతో ఆయన కలవలేదు. పార్టీ సమావేశాల్లోనూ ఆయన కలవ లేదు.

టీడీపీ నేత అరెస్ట్ ను నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు తాజాగా అసెంబ్లీలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగానికి ముందు తరువాత నిరసన కొనసాగించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

అయితే కేఈ ప్రభాకర్ టీడీపీ ఎమ్మెల్సీలతో కలవలేదు. నిరసన తెలుపలేదు. వాకౌట్ చేయలేదు. సభలోనూ కూర్చుండిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీలు పిలిచినా పట్టించుకోలేదు. నారా లోకేష్ చేపట్టిన నిరసనలు, ఆందోళనల్లో కూడా కేఈ పాల్గొనలేదు.

టీడీపీ సీనియర్ నాయుడు , మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి స్వయాన సోదరుడైన కేఈ ప్రభాకర్ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆయన పార్టీ నుంచి వైదొలిగారు.