Begin typing your search above and press return to search.
బాబు సీన్లోకి రాకుండా తెలుగు తమ్ముళ్ల ‘వెలిగొండ’ ఉద్యమం
By: Tupaki Desk | 1 Sept 2021 11:00 AM ISTఅయిన దానికి కానిదానికి సీన్లోకి వచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. తప్పుల మీద తప్పులు చేస్తుంటారన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అధినేత స్థాయిని మొయింటైన్ చేయాలే కానీ.. అన్ని విషయాల్లోనూ తాను కనిపించాలన్న తపన ఎంత తగ్గించుకుంటే బాబుకు అంత మంచిదన్న మాట పలువురు సూచనలు చేస్తుంటారు. తాను సీన్లోకి రాకుండా.. తన సైన్యాన్ని నడిపించే ఎత్తుగడకు ఇన్నాళ్లకు తెర తీశారు చంద్రబాబు. ప్రకాశం.. నెల్లూరు జిల్లాల రైతాంగానికి అవసరమైన సాగునీరుతో పాటు.. రెండు జిల్లాల ప్రజల తాగునీటి ఇక్కట్లకు చెక్ చెప్పేందుకు వెలిగొండ ప్రాజెక్టు చాలా కీలకం.
విభజన చట్టంలో దీని ప్రస్తావన ఉన్నప్పటికీ.. ఈ ప్రాజెక్టును అనుమతి లేని ప్రాజెక్టుగా పేర్కొనటంపై రగడ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఏపీ అధికారపక్ష నేతలు టేకప్ చేసి.. ఇష్యూ క్లోజ్ చేయాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వెలిగొండను అక్రమ ప్రాజెక్టుగా పేర్కొనటంపై ఈ జిల్లాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేందుకు.. కేంద్రంలో కదలిక కోసం ప్రకాశం.. నెల్లూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం ప్రజాప్రతినిధులు.. మాజీ ప్రతినిధులు పలువురు నడుం బిగించారు.
ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసి.. వెలిగొండ ప్రాజెక్టు అవసరాన్ని.. ప్రాధాన్యతను వివరించటమే కాదు.. అక్రమ ప్రాజెక్టు అంటూ వ్యాఖ్యానించటాన్ని తప్పుపట్టారు. అంతేకాదు.. కేంద్రం చేసిన తప్పునకు రెండు జిల్లాల ప్రజలు బాధ్యత వహించటం ఏమిటని ప్రశ్నిస్తూ.. విభజన చట్టంలో ఉండి.. కూడా అక్రమ ప్రాజెక్టు ఎలా అవుతుందన్న కీలక ప్రశ్నల్ని సంధించారు. ఈ క్రమంలో ఏపీ అధికారపక్షం ఫెయిల్యూర్ గా అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన వారు.. అనూహ్యంగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లటం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని కలిశారు. తమ సమస్యను చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో ఫోన్లో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ లో పొందుపర్చాలన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిని తెలుగు తమ్ముళ్ల టీం భేటీ అయ్యారు. గెజిట్ లోని 24వ పేజీలో వెలిగొండ ప్రాజెక్టును అనుమతి లేని ప్రాజెక్టుగా పేర్కొన్నారని.. దీన్ని తెలంగాణ ప్రభుత్వం సాకుగా తీసుకొని అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.
ఉప రాష్ట్రపతిని.. కేంద్రమంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేల్లో గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), డోలా బాల వీరాంజనేయ స్వామి (కొండపి), ఏలూరి సాంబశివరావు (పరుచూరు)తదితరులు ఉన్నారు. వాస్తవానికి ఢిల్లీలో ఉప రాష్ట్రపతి.. కేంద్రమంత్రిని కలిసి విషయం మీద మాట్లాడాలంటే అయితే పార్టీ అధినేత చంద్రబాబు కానీ.. ఆయన కుమారుడు లోకేశ్ కానీ ఉండటం సహజం. రోటీన్ కు భిన్నంగా పార్టీ అగ్రనేతలు ఇద్దరే కాదు.. ఏపీ రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కూడా ఢిల్లీ టూర్ కు దూరంగా ఉండటం.. ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ జిల్లాల నేతలు వెళ్లి ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేలా ప్రయత్నించటం కొత్తగా ఉందని చెప్పాలి.
రోటీన్ కు భిన్నంగా సాగిన ఈ పర్యటన టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని కలగిస్తే.. మైలేజీ వచ్చే అంశాల్ని వదిలేయటం ఎంత తప్పన్న విషయం అధికార పార్టీ నేతలకు అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి. వాస్తవంగా ఇలాంటి అంశాల్ని టేకప్ చేసి.. అధికారపక్షం తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్ టీం ఎందుకు నిరాసక్తతో ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.