Begin typing your search above and press return to search.
సంకెళ్ల తో అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ నేతలు !
By: Tupaki Desk | 3 Dec 2020 10:50 AM ISTనారా లోకేష్ చేతికి సంకెళ్లా అని ఆలోచనలో పడ్డారు. నిజంగానే నారా లోకేష్ చేతికి సంకెళ్లు ఉన్నాయి. అయితే , ఆ సంకెళ్లు పోలీసులు వేయలేదులేండి .. ఆయనే వేసుకున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ? ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. గత మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సభలో టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుధం జరుగుతుంది. ఈ కారణంగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో ..కొంతమంది టీడీపీ నేతలని వరుసగా మూడో రోజు కూడా సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే .. తాజాగా నాలుగో రోజు సభ కి టీడీపీ నేతలు విన్నూతనంగా వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు.
నాలుగో రోజు సమావేశాలకి టిడిపి నేతలు చేతులకు సంకెళ్లతో అసెంబ్లీకి వచ్చారు. టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా సంకెళ్లతో అసెంబ్లీ కి వచ్చారు. రాష్ట్రంలో వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అసెంబ్లీకి సంకెళ్లతో వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఎస్సీ, ఎస్టి, బీసీ, ముస్లిం మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, నమ్మి ఓట్లు వేయడమే వారు చేసిన తప్పా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే , ఈరోజు సభలో ఎస్సి, ఎస్టీ, బిసి, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన బిల్లులపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశాలు రేపటి తో ముగియనున్నాయి.