Begin typing your search above and press return to search.

టీడీపీ నేతల గ్రానైట్ క్వారీ లీజులు రద్దు!!

By:  Tupaki Desk   |   25 Aug 2020 4:20 PM IST
టీడీపీ నేతల గ్రానైట్ క్వారీ లీజులు రద్దు!!
X
అధికార వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు గట్టి షాకిచ్చింది. వారికి కేటాయించిన గ్రానైట్ క్వారీ లీజులను రద్దు చేస్తూ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుల గ్రానైట్ క్వారీ లీజులను ఏపీ సర్కార్ రద్దు చేసింది. ప్రభుత్వం క్వారీయింగ్ లో లోపాలున్నాయని.. లీజులను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీతోపాటు ఆయన సన్నిహితుల ఆరు క్వారీలు.. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన ఒక క్వారీ లీజును రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ కంపెనీలకు పెద్ద ఎత్తున జరిమానాలను కూడా విధించారు. తనిఖీలు నిర్వహించి తాజాగా లీజులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.