Begin typing your search above and press return to search.
టీడీపీ సిల్లీ కంప్లెయింట్ చూశారా?
By: Tupaki Desk | 12 April 2017 3:54 PM ISTటీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హైదరాబాదులోని తన పాత ఇంటిని కూలగొట్టేసి ప్యాలెస్ లాంటి భవంతిని కట్టుకున్నారు. సదరు భవంతికి ఆదివారం రిబ్బన్ కూడా కట్ చేశారు. సంప్రదాయ బద్ధంగా, శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించిన బాబు ఫ్యామిలీ అందులో ప్రవేశించింది. బాబు గారికి కుటుంబ పరంగానే కాకుండా... పార్టీ పరంగానూ పెద్ద బంధు వర్గమే ఉంది. అయితే కొత్తింటి గృహ ప్రవేశానికి బాబు ఫ్యామిలీ అతి కొద్ది మంది బంధువులను మాత్రమే ఆహ్వానించింది. మొత్తం కార్యక్రమాన్ని అత్యంత రహస్యంగా నిర్వహించిన చంద్రబాబు... మీడియాను ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా కట్టడి చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి.
అదే సమయంలో బాబు ఇల్లు ఇదేనంటూ కొన్ని పత్రికలు... ఆయన ఇంటిని దూరం నుంచి తీసిన ఫొటోలతో వార్తలు రాసేశాయి. ఇక సోషల్ మీడియాలో అయితే బాబు గారి కొత్తింటిలో గదులెన్ని ఉన్నాయి? వాటిలో ఏ స్థాయిలో సౌకర్యాలున్నాయి? ఆ సౌకర్యాలకు అయిన ఖర్చెంత అన్న అంశంపై లెక్కకు మిక్కిలి కథనాలే వచ్చేశాయి. అంతేకాదండోయ్... బాబు గారి కొత్తింటిలో బెడ్ రూంలు, లివింగ్ రూంలు ఇవేనంటూ కొన్ని ఫొటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. అయినా తాము చీమను కూడా లోపలికి అనుమతించకున్నా... ఈ ఫొటోలు బయటకు ఎలా వచ్చాయంటూ ఆరా తీసిన బాబు అండ్ కో... కాసేపటి క్రితం విజయవాడలో రోడ్డుపైకి వచ్చేసింది.
బాబు ఇంటి ఫొటోలంటూ సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రసారమవుతున్నాయని, బిలియనీర్లు ముఖేశ్ అంబానీ - విజయ్ మాల్యాల ఇళ్లల్లోని ఇంటీరియర్లను బాబు ఇంటిలోనివిగా చూపుతూ ప్రచారం చేస్తున్నారని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు స్త్రకంగా ఫిర్యాదే చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు.. మీడియాతో మాట్లాడుతూ... బాబు ఇల్లు ఇదేనంటూ బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు తప్పుడువని ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటనతో బాబు గారి ఇంటికి సంబంధించి ప్రచారంలోకి వచ్చిన చాలా ఫొటోలు నిజమైనవేనని వారు ఒప్పేసుకున్నట్టైంది.
ఇక అంతటితో ఆగని టీడీపీ నేతలు... ఈ అసత్య ప్రచారానికి కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి పత్రికతో పాటు వైపీసీ నేతలేనంటూ మరో ఆరోపణ చేశారు. అయినా... ఇలా ఫొటోలు ప్రచురిస్తేనే జడిసిపోతున్న తెలుగు తమ్ముళ్లు... ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు తన ఇంటి గృహ ప్రవేశాన్ని అంత సీక్రెట్‌గా ఎందుకు నిర్వహించుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం మరచినట్లున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/