Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు వల్లభనేని వంశీ వెల్కమ్.. దుమ్ముదులిపిన తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   8 Oct 2020 9:45 AM IST
చంద్రబాబుకు వల్లభనేని వంశీ వెల్కమ్.. దుమ్ముదులిపిన తమ్ముళ్లు
X
తెలుగు దేశంలో రాజకీయంగా ఎదిగి ఇప్పుడు అవసరార్థం వైసీపీ వైపు టర్న్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దుమ్ము దులిపేశారు తెలుగు తమ్ముళ్లు. తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై వంశీ ఘాటు ట్వీట్ కు కాస్త గట్టిగానే స్పందించారు. ఆయనను ఇక వైసీపీ నాయకుడిగానే వాళ్లందరూ చూస్తున్నట్టు ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన మాజీ బాస్ అయిన చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా వెల్ కం చెప్పారు. చంద్రబాబు అమరావతి పర్యటనను దెప్పి పొడుస్తూ వంశీ ఓ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరదేశి.. అజ్ఞాతవాసి.. తెలంగాణ రాష్ట్ర నివాసి.. మాన్యశ్రీ చంద్రబాబు గారి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం.. సుస్వాగతం’ అంటూ మనసులోంచి ఉప్పొంగిన కవితాత్మక హృదయంతో కాస్త సెటైరికల్ గా వల్లభనేని వంశీ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో అసలే యాక్టివ్ గా ఉండే టీడీపీ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. చంద్రబాబుపై సెటైర్లు వేస్తావా అంటూ వంశీని అదే సోషల్ మీడియా కడిగిపారేశారు. ఇప్పుడ ట్వీట్లు.. రీట్వీట్లు, కౌంటర్లతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది వైరల్ అవుతోంది.

వల్లభనేని వంశీ ట్వీట్ తర్వాత వైసీపీ కార్యకర్తలు వర్సెస్ తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే వంశీకి కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు మాంచి పదజాలంతో అదే రీతిలో పంచ్ లు పేల్చారు. ‘వైస్సార్సీపీ లో "పరదేశి" రాజకీయ భవిష్యత్ "అజ్ఞాతవాసి".. తెలంగాణా రాష్ట్రంలో ఆస్తులు కాపాడుకునే "పిపాసి".. గౌరవ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారికి రాజకీయ వైరాగ్యం సందర్భంగా వందనాలు-శుభాభివందనాలు.’ అంటూ టీడీపీ ఫ్యాన్స్ ట్విట్టర్ లోనే గట్టిగా బదులిచ్చారు.

ఇలా వంశీ తాజాగా చంద్రబాబుపై సెటైర్లు వేయడం.. దానికి కౌంటర్ గా టీడీపీ ఫ్యాన్స్ కౌంటర్లతో సోషల్ మీడియాలో హాట్ హాట్ గా పంచులు పేలుతున్నాయి. చూడడానికి ఇది యమ రంజుగా సాగుతోంది. వైరల్ అవుతోంది.