Begin typing your search above and press return to search.
ఆ ఇంటర్వ్యూ... తమ్ముళ్లకు చుక్కలు
By: Tupaki Desk | 7 Jan 2019 1:39 PM ISTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటే ఇంటర్య్వూ. తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టిస్తోందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓ ఛానెల‌్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఆదివారం ప్రసారం అయ్యింది. ఇంటర్వ్యూ 45 నిమిషాల పాటే ఉన్నా జగన్ తన మనసులోని మాటలను, అధికార అక్రమాలను ఎండగట్టిన తీరుపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై జగన్మోహన్ రెడ్డి సంధించిన విమర్శనాస్త్రాలు ఆ పార్టీ శ్రేణులకు చుక్కలు చూపించాయంటున్నారు. తనపై వ్యక్తిగతంగా తెలుగుదేశం నాయకులు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. "నన్ను ఉద్దేశించి తెలుగుదేశం నాయకులు ఆ నా కొడుకు... ఈ నా కొడుకు అంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా... దేశంలో అందరి కంటే సీనియర్ నాయకుడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు వారిని వారించరు. ఇదీ ఆయన తీరు" జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా చేసిన ఈ ఇంటర్య్వూలో రాష్ట్ర అంశాలతో పాటు జాతీయ రాజకీయాల పట్ల కూడా జగన్ విపులంగా చర్చించడం అటు తెలుగుదేశం నాయకులకు ఇబ్బందిని కలిగిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోవడానికి గల కారణాలను జగన్ విశ్లేషించిన తీరు... ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. " తెలంగాణలో జగన్ కు కొన్ని చోట్ల మాత్రమే బలం ఉంది. ఆ విషయాన్ని ఆయన గుర్తించారు. అంతేకాదు... నల్గగొండ జిల్లాలో తాము చాలా బలంగా ఉన్నామని, ఒకవేళ అక్కడ పోటీ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచి ఉండే వారు కాదని జగన్ చెప్పడం ఆయన పరిణితికి నిదర్శనం " అని రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి... అందునా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు మేలు చేసేందుకే పోటీ చేయలేదన్న విమర్శలను కూడా జగన్ తిప్పికొట్టారు. " తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజయానికి నేను సహకరించాననడం తప్పు. నిజానికి ఆయన విజయానికి ఏ ఒక్కరి సహాయం అవసరం లేదు" అని జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన నిజాయితీని చూపించాయని అంటున్నారు. మొత్తానికి జగన్ ఇంటర్య్వూ తెలుగుదేశం శ్రేణులకు నిద్ర లేకుండా చేస్తోందని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జరుగుతోందంటున్నారు.