Begin typing your search above and press return to search.

కోడెల శివరాంపై కేసు పెట్టిన టీడీపీ నేత.. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   8 Feb 2021 4:30 PM IST
కోడెల శివరాంపై కేసు పెట్టిన టీడీపీ నేత.. ఎందుకంటే ?
X
కోడెల శివరాంపై కేసులు, ఫిర్యాదులు ఆగడం లేదు. టీడీపీ అధికారంలో ఉండగా ఆయన చేసిన వ్యవహారం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తాజాగా కోడెల శివరాంపై ఒక మద్యం వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల సందర్భంగా తన వద్ద 1.30 కోట్ల రూపాయల విలువైన మద్యం తీసుకుని, తనకు ఇప్పటి వరకూ డబ్బులు చెల్లించడం లేదని వ్యాపారి నర్రా రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిగితే డబ్బులు ఇవ్వకుండా కోడెల శివరాం బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.

గత సార్వత్రిక ఎన్నికలకు తన తండ్రి శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో మద్యం పంపిణీ చేసేందుకు రూ.1.30 కోట్ల లిక్కర్‌ను తీసుకుని నగదు చెల్లించలేదని, డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

2015 నుంచి 2019 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారుల నుంచి అనధికారికంగా నగదు వసూలు చేశాడని ఆరోపించారు. నర్రా రమేష్ రాజుపాలెం మండలం గణపవరంకు చెందిన టీడీపీ నేత కావడం కలకలంరేపింది. రమేష్ ఫిర్యాదుపై శివరాం స్పందించాల్సి ఉంది. గతంలో కూడా శివరాంతో పాటూ ఆయన సోదరిపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.