Begin typing your search above and press return to search.

దసరా తరువాత టీడీపీకి కష్టకాలమే

By:  Tupaki Desk   |   20 July 2017 10:57 AM IST
దసరా తరువాత టీడీపీకి కష్టకాలమే
X
టీఆరెస్ లోకి ఎవరొచ్చినా ఎన్నికలకు ముందే రావాలి.. సరిగ్గా ఎన్నికల సమయంలో వస్తే క్యాడర్ లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది.. క్యాడర్ అడ్జస్ట్ కావడానికి కూడా సమయం ఉండదు.. ఇదీ ఆ పార్టీ తీసుకున్న కొత్త నిర్ణయం. దీంతో గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్షకు రెడీ అవుతున్నట్లు అర్థమవుతోంది. అది కూడా మరికొద్ది నెలల్లో మొదలవుతుందని తెలుస్తోంది. దసరా తరువాత మంచి ముహూర్తాలు ఉండడంతో సరైన ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ - టీడీపీలను ఖాళీ చేసే పనిని రీ ఓపెన్ చేయాలని టీఆరెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

టీడీపీలో ఇంకా మిగిలిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వచ్చే ఏడాది జంప్ అవుదామ‌ని అనుకున్నార‌ట‌. కానీ... ఈ ఏడాదే రావాలని టీఆరెస్ నుంచి సూచనలు వెళ్లాయని టాక్. నియోజకవర్గాల పెంపు విషయంలో క్లారిటీ వచ్చేస్తే కాంగ్రెస్ నుంచి కొత్తగా టిక్కెట్లు ఆశిస్తున్నవారంతా టీఆరెస్ లోకి గంపగుత్తగా వచ్చి చేరే అవకాశముందని తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ కూడా త‌మ పార్టీలోకి వ‌చ్చే వారు ఇప్పుడే రావాల‌ని సంకేతాలు పంపిస్తుంద‌ట‌. దీంతో ఫ‌స్ట్ ఆప్ష‌న్ టీఆర్ ఎస్‌..సెకండ్ ఛాయిస్ కాంగ్రెస్‌…అని కొంద‌రు నేత‌లు ఇప్ప‌టికే మంత‌నాలు ప్రారంభించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మళ్లీ మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నవారు అటు వైపు కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది.