Begin typing your search above and press return to search.

జగన్ గొప్పతనంపై టీడీపీ నేత స్పందన

By:  Tupaki Desk   |   21 Jun 2019 10:49 AM IST
జగన్ గొప్పతనంపై టీడీపీ నేత స్పందన
X
నిండా మునిగాక కానీ టీడీపీ నేతలకు ఇప్పుడు తత్త్వం బోధపడడం లేదు. ఇప్పుడు టీడీపీ చేసిన తప్పులను ఏకరవుతుపెడుతున్నారు.. తాము చేసింది తప్పేనంటున్నారు. జగన్ ఎన్నికష్టాలు అనుభవించినా మాట మీద నిలబడ్డారని.. ఆయనను నమ్మినవాళ్లు ఇప్పుడు అగ్రపీటాలు అధిరోహించారని.. నమ్మకానికి జగన్ ప్రతిరూపమని అంటున్నారు.. ఇంతకీ ఇలా అన్నది ఎవరో కాదు.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్నా.. వైసీపీ అన్నా.. జగన్ అన్నా ఉరికివచ్చి మరి విమర్శలు చేసే బుద్దా వెంకన్న.. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన వేళ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాము అధికారంలో ఉండగా.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగి తప్పు చేశామని..కానీ జగన్ అంత మెజార్టీ సాధించినా పార్టీ ఫిరాయింపులు చేయకుండా ఉండడం గ్రేట్ అంటూ బుద్దా వెంకన్న ప్రశంసించారు. తాము తీసుకున్న 23మంది ఓడిపోయారని.. వారికి భవిష్యత్ లేకుండా పోయిందన్నారు. అదే జగన్ ను నమ్మి ఉన్న వాళ్లు ఇప్పుడు మంత్రులయ్యారని కొనియాడారు.

అయితే బీజేపీ మాత్రం టీడీపీ బాటలోనే నడుస్తూ తమ ఎంపీలను లాగేసుకోవడం దారుణమని విమర్శించారు. సర్పంచ్ గా కూడా గెలవని వారిని ఎంపీలను చేసిన ఘనత చంద్రబాబుది అని.. అయితే వారు నెలరోజులు టీడీపీ అధికారం కోల్పోయేసరికి బీజేపీలో చేరిపోయారని బుద్దా వెంకన్న విమర్శించారు.

కష్టాల్లో ఉన్నా.. జైలుకెళ్లినా వైఎస్ జగన్ వెంట ఉన్న విజయసాయిరెడ్డిని ప్రశంసించాడు వైఎస్. ఇక ఏపీలో పార్టీ ఉనికి లేకున్నా ఆ పార్టీ కోసం పోరాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్ లాంటి వారు తమ వాణి వినిపించారని.. ధైర్యంగా నిలబడ్డ ఈ ఇద్దరిని ప్రశంసించాల్సిందేనని బుద్దావెంకన్న కొనియాడారు.

అయితే ఇన్నాళ్లు జగన్ ను తిట్టిన బుద్దా వెంకన్న ఇప్పుడు సడన్ గా జగన్ ను పొగడడం.. ఆయన విధానాలను ప్రశంసించడం చూసి అందరూ అవాక్కయ్యారు. కొంప దీసి ఈయన కూడా వైసీపీలో చేరబోతున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.