Begin typing your search above and press return to search.

పురివిప్పిన కక్షలు.. టీడీపీ నేత హత్య

By:  Tupaki Desk   |   22 May 2019 11:43 AM IST
పురివిప్పిన కక్షలు.. టీడీపీ నేత హత్య
X
ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక్క రోజు ముందు కలకలం చెలరేగింది. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డిని బుధవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. ఈ శేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు కావడం విశేషం. దీంతో కర్నూలులో మళ్లీ పాతకక్షలు పురవిప్పాయి.

కర్నూలు జిల్లా డోన్ మండలం తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డిని ప్రత్యర్థులు బండరాయితో కొట్టి చంపారు. బుధవారం బైక్ పై వెళ్తున్న శేఖర్ రెడ్డిని ప్రత్యర్థులు రోడ్డుపక్కన కాపు కాసి హత్య చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా కర్నూలు జిల్లాలో పోటీచేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి - కేఈ కృష్ణమూర్తి కుటుంబాలకు హత్యకు గురైన శేఖర్ రెడ్డి సన్నిహితుడు కావడంతో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది.

అయితే పోలీసులు మాత్రం శేఖర్ రెడ్డి హత్యకు రాజకీయాలకు సంబంధం లేదని చెబుతున్నారు. సివిల్ భూమి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి భూమి వివాదం ఉన్న వారిని విచారించేందుకు పోలీసులు ఆరాతీస్తున్నారు.