Begin typing your search above and press return to search.

నా ఇంటికి నేను వచ్చేశా: రఘరామ కృష్ణంరాజు

By:  Tupaki Desk   |   3 March 2019 8:18 AM GMT
నా ఇంటికి నేను వచ్చేశా: రఘరామ కృష్ణంరాజు
X
రఘురామకృష్ణంరాజు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేవీపీకి స్వయానా వియ్యంకుడు. అన్నింటికి మించి పెద్ద పారిశ్రామిక వేత్త. 2014 ఎన్నికల్లోనే తన అఫిడవిట్‌ లో రూ.700 కోట్లు ఆస్తి ఉన్నట్లు చూపించిన మహా ధనవంతుడు. రఘురామ కృష్ణంరాజుకి వ్యాపారం అంటే ఎంత ఇష్టమే.. రాజకీయాలు కూడా అంతే ఇష్టం. అందుకే ఎప్పుడు ఏదో ఒక పార్టీలో ఉంటారు. 2014 ముందు టీడీపీలో చేరారు ఆయన. అంతకుముందు వైసీపీలో ఉండేవారు. ఇప్పుడు టీడీపీ నుంచి ఎంపీ టిక్కెట్‌ కష్టమని తేలడంతో.. మళ్లీ వైసీపిలోకి వచ్చేశారు. ఈ ఉదయం జగన్‌ ని లోటస్‌ పాండ్‌ లో కలిశారు. తాను 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

వైసీపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడారు రఘురామ కృష్ణంరాజు. మళ్లీ తన ఇంటికి తాను వచ్చేసినట్లు ఉందని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను టీడీపీలోకి వెళ్లినా జగన్‌ కు, తనకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక తాను విపరీతంగా పార్టీలు మారతానని విమర్శలు చేస్తున్నవారికి పనీపాటా ఏం లేదని ఎద్దేవా చేశారు రఘురామకృష్ణంరాజు. వచ్చే ఎన్నికల్లో తాను నరసాపురం నుంచి బంపర్‌ మెజారిటీతో గెలుపొందబోతున్నట్లు చెప్పారు. సరిగ్గా వారం రోజుల క్రితం మీరు వైసీపీలోకి వెళ్తారనే వార్తలు వస్తున్నాయని మీడియా అడింగింది. తన ప్రాణం ఉన్నంతవరకు తాను టీడీపీలోనే ఉంటానని చెప్పిన రఘురామ కృష్ణంరాజు.. కట్‌ చేస్తే నాలుగు రోజుల్లో వైసీపీలో జాయిన్ అయిపోయారు. నరసాపురం ఎంపీ టిక్కెట్‌ పై ఆయనకు చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతోనే వైసీపీలో చేరినట్లు సమాచారం.