ఆ ఎమ్మెల్యే వైసీపీలో ఉంటూనే.. `ఫ్యూచర్` చక్కబెట్టుకుంటున్నారే!

Wed Sep 28 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

tdp leader on ycp

తమ్ముడు తమ్ముడే.. అన్నట్టుగా రాజకీయాలు రాజకీయాలే..!  పార్టీ ఏదైనా..అధినేత ఎవరైనా.. తమకు పాజిటివిటీ లేనప్పుడు.. ఎందుకు ఉండాలనే ధోరణి పెరిగిపోయింది. ఏపీలో అయితే.. ఈ పరిస్థితి ఎక్కు వగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో .. లేదో.. అనే బెంగ తో ఉన్న చాలా మంది నాయకులు.. ఇప్పటి నుంచి ఇల్లు చక్కబెట్టుకుంటున్నారనే గుసగుస జోరుగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయాన్ని.. జగన్ పదే పదే చెబుతున్నారు.ప్రజల్లో ఉన్నవారికి.. ప్రజలతోజై కొట్టించుకునేవారికి మాత్రమే టికెట్ ఇస్తామని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఎగిరిపోవడం ఖాయమని..అంటున్నారు. ఇక ఇదేసమయంలో ఒక నియోజ కవర్గంలో ఇద్దరు చొప్పున పోటీ పడుతున్న చోట..సీఎం జగన్ తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తారని నమ్ముతున్న నాయకులుకూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇలాంటి నియోజకవర్గమే ప్రకా శం జిల్లాలో ఉందట. గత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కడ గెలిచిన నాయకుడు.. మంత్రి అయ్యారు కూడా!

ఆ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒకరు టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. అయితే.. ఆయన ఇంటిపోరు పెరిగిపోయింది. గతంలో టికెట్ ఇచ్చినా.. పోటీ చేయననిచెప్పిన నాయకు డు.. ఇప్పుడు పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక తనకు టికెట్ దక్కడం గ్యారెంటీ లేదని.. నిర్ణయానికి వచ్చి.. ఓ కీలక పార్టీని ఎంచుకున్నారనే గుసగుస ఇటీవల కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు మరింతగా.. ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

అదేసమయంలో.. ఆయన `ముందు` చూపునకు కూడా.. అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన అనుచరులను లోపాయికారీగా.. రేపు తాను చేరబోయే పార్టీలో ముందుగానే  చేర్పించేస్తున్నారనే గుసగుస ప్రకాశంలో జోరుగా వినిపిస్తోంది. తాజాగా.. ఓ పార్టీలో 100 మందికి పైగా.. ఈ నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు చేరిపోయారు. వీరిలో సదరు ఎమ్మెల్యే సోదరుడి ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారని అంటున్నారు.

ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతోందని.. సాధ్యమైనంత వరకు వైసీపీని ఇక్కడ వీక్ చేసేసి.. రేపు తాను చేరబోయే పార్టీని బలోపేతం చేసుకునేం దుకు సదరు ఎమ్మెల్యే  పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. నిజానికి ఎమ్మెల్యే కాదంటే.. వారు పొరుగు పార్టీలో చేరే ధైర్యం కూడా చేయరని అంటున్నారు. సో.. మొత్తానికి ఈ ఎమ్మెల్యే ముందు చూపుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుండడం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.