Begin typing your search above and press return to search.
లోకేష్ కి ఈ పది రోజులు చాలా ఇంపార్టెంట్ ట...?
By: Tupaki Desk | 16 Jan 2023 9:00 AM ISTతెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 27 నుంచి ఆయన కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెడుతున్నారు. మొత్తం 400 రోజులు 4 వేల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రకు లోకేష్ సిద్ధమవుతున్నారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన వారు మరొకరు లేరు. దాంతో లోకేష్ పాదయాత్ర చేపడితే కనుక కచ్చితంగా అది గిన్నీస్ రికార్డ్ అవుతుంది. ఏపీలో జగన్ 3,700 కిలోమీటర్ల రికార్డు కూడా బద్ధలు అవుతుంది.
ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్ర మూడ్ లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన పూర్తిగా ఆఫ్ లైన్ లోనే ఉంటున్నారు. మరీ ముఖ్యమైన విషయం అయితే తప్ప ట్విట్టర్ వేదికగా కూడా రియాక్ట్ అవడంలేదు. మరి ఆయన ఏమి చేస్తున్నారు అంటే పూర్తిగా ఇంటి పట్టునే గడుపుతున్నారుట. తన కుటుంబంతోనే ఆయన టైం పాస్ చేస్తున్నారుట.
ఈ పది రోజులు అయితే మరీ కీలకం అని ఆయన భావిస్తున్నారుట. సంక్రాంతి పండుగకు లోకేష్ నారావారి పల్లెకు వచ్చారు. అక్కడ అందరితో కలసి సంబరాలు చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ కి బయల్దేరి వెళ్లాక కూడా ఫుల్ గా ఫ్యామిలీతోనే గడపబోతున్నారుట. ఎందుకంటే ఒక్కసారి పాదయాత్రలోకి దిగాక అది కంటిన్యూస్ గా సాగుతుంది.
ఈ మధ్యలో విరామం ప్రకటించి వెనక్కి తిరిగే పరిస్థితి ఉండదు. ఇక తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూసేందుకు వీలు పడదు. వారే తాను పాదయాత్ర చేసిన చోటుకు రావాల్సి ఉంటుంది. అలా పూర్తిగా ఫ్యామిలీకి దూరం కావాల్సి ఉంటుంది. అది కూడా ఏకంగా ఏడాది కాలం పాటు. అందుకే లోకేష్ ఉన్న విలువైన సమయం అంతా పూర్తిగా ఫ్యామిలీ కోసమే కేటాయిస్తున్నారు అని అంటున్నారు.
ఆయన తిరిగి ఇంటికి చేరేది 2024లోనే కాబట్టి ఈ పది రోజులు చాలా విలువైనదిగా భావించి ఇంటి పట్టునే ఉంటున్నారు అని అంటున్నారు. ఇక లోకేష్ ఈ ఏడాదితో నాలుగు పదుల మైలు రాయిని దాటబోతున్నారు. ఏపీలో సుదీర్ఘమైన పాదయాత్రను చేసిన వారిలో లోకేష్ పిన్న వయస్కుడు అని చెప్పాలి. వైఎస్సార్ 54 ఏళ్ల వయసులో పాదయాత్ర చేస్తే చంద్రబాబు 63 ఏళ్ల వయసులో పాదయాత్ర చేశారు. ఇక జగన్ 45 ఏళ్ల వయసులో పాదయాత్రకు శ్రీకారం చుడితే వైఎస్ షర్మిల 42 ఏళ్ల వయసులో పాదయాత్ర చేపట్టారు.
దాంతో పాటు అందరి కంటే ఎక్కువ కిలోమీటర్లు నడవాలి అన్నది లోకేష్ ఆలోచన. ఇక మిగిలిన వారు అంతా ఎక్కడో ఒక చోట విరామం కొంత అయినా ప్రకటించి పాదయాత్ర పూర్తి చేశారు. కానీ లోకేష్ పట్టుదల చూస్తూంటే ఏ ఒక్క రోజునా విరామం ప్రకటించకుండా సాలిడ్ గా పాదయాత్ర చేసి చూపిస్తాను అని అంటున్నారు. లోకేష్ ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ కూడా పూర్తి స్థాయిలో మారిపోతుంది ఈ పాదయాత్రతో అని తెలుగుదేశం వర్గాలు ఆశాభావంగా ఉన్నాయి. దాంతో లోకేష్ పాదయాత్ర వెరీ స్పెషల్ కానుంది.