Begin typing your search above and press return to search.
బాబు వెనక చినబాబు... డౌట్ కొడుతోందే...?
By: Tupaki Desk | 5 Sept 2022 5:00 AM ISTఅవును. వారికి డౌట్ వస్తోందిట. అది నిజమేనని కూడా అనిపిస్తోందిట. లేకపోతే ఇంతటి అయోమయం గందరగోళం ఏంటి పార్టీలో అని సీనియర్లు తలలు పట్టుకుంటున్నారుట. చంద్రబాబు టీడీపీకి సుప్రీం. ఆయన మాట ఎవరికైనా శిరోధార్యం. కానీ ఇపుడు అక్కడ లోపల సీన్ వేరేగా ఉంది అంటున్నారు. లోకేష్ ఇపుడు కీలకమైన పాత్ర పోషిస్తున్నారుట. చంద్రబాబుకు సలహాలు సూచనలు ఆయన నుంచే అందుతున్నాయని అంటున్నారు.
టీడీపీలో గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఒక్కటే పవర్ సెంటర్ గా ఉండేది. ఆయనే చంద్రబాబు అని అందరికీ తెలుసు. బాబు తో మాట్లాడుకుంటే వ్యవహారం సెటిల్ అయ్యేదిట. కానీ ఇపుడు చూస్తే మాత్రం చినబాబు సీన్ లోకి వచ్చారని ఆయన వల్ల ఎవరికి టికెట్లు వస్తాయో ఎవరికి పోతాయో అర్ధం కావడం లేదు అంటున్నారు.
మరీ ముఖ్యంగా పెద్ద తలకాయలు సీనియర్లు అయితే లోకేష్ తమకు టికెట్లు ఇవ్వరేమో అని అనుమానిస్తున్నారుట. ఏపీలో పరిస్థితి చూస్తే టీడీపీ ఎన్నడూ లేనంతగా విషమ పరీక్షను ఎదుర్కొంటోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సి ఉంది. కానీ దానికంటే ముందు పార్టీకి ఒక క్లారిటీ ఇచ్చి కనీసం గెలిచే సీట్లు అని అనుకున్న చోట పోటీ లేని చోట అయినా ముందుగా క్యాండిడేట్లను డిసైడ్ చేస్తే బాగుంటుంది అని పార్టీలో సీనియర్లు అంటున్నారు.
అలాగే గెలిచే వారు సీనియర్లు అయినా టికెట్లు ఇస్తేనే పార్టీకి పవర్ దక్కుతుంది అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడే అసలైన తకరారు ఎదురవుతోందిట. చంద్రబాబు ఒకరికి హామీ ఇస్తే లోకేష్ మరొకరికి హామీ ఇవ్వడంతో ఉన్న చోటనే ఇద్దరేసి ముగ్గురేసి రేసులోకి వస్తున్నారు అని అంటున్నారు.
అదే విధంగా కొన్ని చోట్ల సీనియర్లు ఉన్న చోట ఈ రోజుకీ టికెట్ల విషయంలో ఒక క్లారిటీ కనీసంగా కూడా లేకపోవడం వెనక లోకేష్ ప్రభావం ఉందని వారు అనుమానిస్తున్నారుట. దాంతోనే వారు లోకేష్ తో అయితే తమకు టికెట్లు దక్కవని కూడా భావిస్తున్నారుట.
ఈ మొత్తం వ్యవహారం చూస్తే చంద్రబాబు మునుపటిలా ఒకే మాటతో ఉండాలని, అవసరం అయితే కఠినంగా వ్యవహరించాలని కూడా అంటున్నారుట. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా బాబు ఏకమొత్తంగా అందరినీ ఒకే త్రాటిపైన నడిపించే విధంగా చూడాలని అంటున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీ చేద్దామని చూస్తున్న సీనియర్లు మాజీ మంత్రులు కూడా పార్టీలో జరుగుతున్న తంతు చూసి తమకు ఈసారి టికెట్ దక్కుతుందా లేదా అన్న టెన్షన్లో ఉంటున్నారుట.
మరి టీడీపీ విషయంలో ఈసారి లోకేష్ జోక్యం పెరిగింది అని అంటున్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తే ఫరవాలేదు కానీ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనే అంటున్నారు. అయితే రేపటి పార్టీ, యువతరం, టీడీపీ ఫ్యూచర్ అన్నీ కూడా ఆలోచించే పార్టీ హై కమాండ్ అడుగులు వేస్తోంది అని అంటున్నారు.