Begin typing your search above and press return to search.
జగన్ కి అచ్చొచ్చిన చోటనే లోకేష్ సిటింగ్...
By: Tupaki Desk | 21 Aug 2022 9:13 PM ISTఏపీలో అయితే అటూ లేకపోతే ఇటూ అన్నట్లుగానే రాజకీయం సాగుతోంది. ఎంత చెప్పుకున్నా వైసీపీకి పోటీ టీడీపీనే తప్ప మరో పార్టే అన్నది కనిపించడంలేదు. దాంతో వైసీపీ మీద జనాలకు విరక్తి వస్తే కచ్చితంగా టీడీపీనే గెలిపిస్తారు అన్నది ఏ సర్వేను అడగకుండా చెప్పేసే విషయం. ఇదిలా ఉంటే విశాఖలో ఒక ప్లేస్ జగన్ కి బాగా అచ్చొచ్చింది.
ఆ ప్లేస్ లో రెండు సంఘటనలు ఏపీ అంతటా నాడు పెద్ద ఎత్తున చర్చకు చోటిచ్చాయి. ఆ ప్లేసే విశాఖ ఎయిర్ పోర్ట్. జగన్ విపక్ష నేతా 2017 జనవరి 26న విశాఖకు వచ్చారు. ఆ రోజు సాయంత్రం విశాఖ బీచ్ లో ప్రత్యేక హోదా కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించడానికి జగన్ విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చారు. అయితే నాడు జగన్ని విశాఖ విమానాశ్రయంలో రన్ వే మీదనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని అక్కడ నుంచి అటే తిరుగు విమానంలో హైదరాబాద్ పంపేశారు.
అయితే కొంతసేపు మాత్రం జగన్ రన్ వే మీదనే కూర్చుని ఆందోళన చేశారు. నాడు అది హైలెట్ అయింది. అదే ఎయిర్ పొర్టులో 2018 అక్టోబర్ లో మరో సంఘటన జరిగింది. జగన్ హైదరాబాద్ వెళ్లడానికి పాదయాత్రకు విరామం ఇచ్చి విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అపుడు ఆయన మీద కోడి కత్తి దాడి జరిగింది. అది అయితే ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. దాంతో మొత్తం సీనే మారిపోయింది. ఒక విధంగా జగన్ సీఎం కావడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నా విశాఖ ఎయిర్ పోర్ట్ కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి.
ఇపుడు అదే విశాఖ ఎయిర్ పోర్టులో టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ ఆందోళన చేపట్టారు. తన ఉత్తరాంధ్రా పర్యటనను పోలీసులు అడ్డుకోవడం మీద ఆయన నిరసన తెలియచేస్తున్నారు. ఆయన శ్రీకాకుళం వెళ్దామనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తిరుగుటపాలో విశాఖకు తెచ్చారు. అటు నుంచి అటే లోకేష్ ని కూడా హైదరాబాద్ విమానం ఎక్కించేశారు. అంటే నాడు జగన్ కి ఏదైతే జరిగిందో నేడు లోకేష్ కి కూడా అదే జరుగుతోంది అన్న మాట.
మరి నాడు జగన్ కి అచ్చొచ్చిన విశాఖ ఎయిర్ పోర్టు ఇపుడు లోకేష్ కి కూడా కలసివస్తుందా అన్న చర్చ అయితే తమ్ముళ్లలో ఉంది మరి. దీని మీదనే వాడి వేడిగా తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. లోకేష్ ని అడ్డుకున్న పోలీసులకు ఇంతకు ఇంత తమ ప్రభుత్వంలో బదులు చెల్లిస్తామని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.