Begin typing your search above and press return to search.

లోకేష్ జస్ట్ అంతే : బాబు గారికి గుండెల్లో గునపమే...?

By:  Tupaki Desk   |   23 May 2022 5:00 AM IST
లోకేష్ జస్ట్ అంతే : బాబు గారికి గుండెల్లో గునపమే...?
X
మనకు పురాణాలలో ప్రబంధాలలో ఒక మంచి వాక్యం ఉంది. అదేంటి అంటే ఎవరికైనా తండ్రిని మించిన తనయుడు కావాలని, ఆ తండ్రికి ఓడించే వాడు కావాలని. అలా కొడుకు చేతిలో ఓడితే తండ్రి జన్మ ధన్యమని. మరి చూస్తే తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు, నారా వారి వారసుడు లోకేష్ విషయంలో ఇవి ఎంత వరకు నిజం. తండ్రి చంద్రబాబుని ఓడించడం అటుంచి ఆయన సరిసమానం గా అయినా ఉన్నారా. పోనీ అలా కూడా కాదు, ఆయనకు నాలుగు అడుగుల వెనకన అయినా ఉన్నారా ఇదే టీడీపీ వారికి డైలీ కెలికేసే ఒక సూటి ప్రశ్న.

బాబు గారు నా వయసు 27 అనవచ్చు. అంతలా ఆయనకు ఎనర్జీ ఉంది కూడా. కానీ బాబు వాస్తవానికి 72 ఏళ్ల వారే కదా. ఆయనను నమ్మే జనం ఈ రోజుకీ ఏపీలో ఉన్నారు. ఇక టీడీపీకి కూడా ఆయన నాయకత్వం మీదనే అపారమైన నమ్మకం. మరి ఆయన తరువాత ఎవరు అన్నదే కదా ఇపుడు చింత.

ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ మాత్రం లోకేష్ గాలి తీసేస్తోంది. ఆయన ఎవరు అని కూడా నిలదీసి ప్రశ్నిస్తోంది. నిజానికి లోకేష్ అన్న మూడు అక్షరాలను ఎపుడూ జగన్ నోటి వెంట పలకరు. ఆయన దృష్టిలో చినబాబు కేరాఫ్ చంద్రబాబు అంతే. ఇక ఇపుడు అదే బాటలో మరో మంత్రి లోకేష్ పరువు తీసేలా మాట్లాడుతున్నారు.

ఆయనే వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి. ఆయన ఇప్పటికి చాలా సార్లు లోకేష్ కి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడారు. లోకేష్ జస్ట్ చంద్రబాబు పుత్ర రత్నం మాత్రమే. అలాంటి లోకేష్ కి మేము ఎందుకు జవాబు చెప్పాలీ ఇదీ కాకాణి వారి పదునైన వాదన.

అంతే కాదు ఆయన మరో మాట కూడా అంటున్నారు. అది టీడీపీ అనుకూల మీడియాను గట్టిగా గుచ్చుకునేలా ఉంది. లోకేష్ కి జాకీలేసి పైకి లేపి హైప్ క్రియేట్ చేసినంత మాత్రాన మేము అతన్ని గుర్తించాలా అని కాకాణి వారు అంటున్నారు. ఇక ఆయనకు వ్యవసాయం గురించి ఏమి తెలుసని మాట్లాడుతున్నారు. ఆయనకు మేము ఎందుకు జవాబు చెప్పాలీ ఇలా సాగుతోంది ఆయన వాదన.

మొత్తానికి లోకేష్ ని జస్ట్ అన్నట్లుగానే వైసీపీ మంత్రులు నాయకులు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ కూడా గట్టిగా కౌంటర్ చేయలేదు. ఆయన ఏ అర్హతతో మాట్లాడుతున్నారు అంటూ లాజికల్ గానే కాకాణి అంటున్నారు. నిజానికి లోకేష్ చంద్రబాబు కొడుకు కాబట్టే ఆ రోజున మంత్రి పదవి దక్కింది. ఈ రోజు ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

అయితే ఆయన మీద పార్టీ మొత్తం బరువు బాధ్యతలను పెట్టడానికి బాబు గారే ఈ రోజుకీ సందేహిస్తున్నారు అన్న టాక్ అయితే బయటకు వెళ్ళిపోయింది. దాంతో ఇపుడు ప్రత్యర్ధి పార్టీలు కూడా లోకేష్ కేరాఫ్ బాబు అంతకు మించి ఏంటి అంటూ ఎదేవా చేస్తున్నారు. మొత్తానికి ఒక తండ్రిగా, ఒక పార్టీ అధినేతగా లోకేష్ మీద వచ్చి పడుతున్న ఈ కామెంట్స్ చంద్రబాబుని ఇబ్బంది పెడతాయనడంలో ఏ మాత్రం డౌట్ అయితే లేదంటున్నారు. అయినా లోకేష్ తన రాజకీయ పరిణతిని చాటుకోవాల్సిన తరుణంలో ఇంకా తడబడుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అన్నదే రాజకీయ విశ్లేషకుల మాట.