Begin typing your search above and press return to search.

జగన్ బెయిల్ రద్దు అయితే... టీడీపీ షాకింగ్ కామెంట్స్... ?

By:  Tupaki Desk   |   24 Feb 2022 10:45 PM IST
జగన్ బెయిల్ రద్దు అయితే... టీడీపీ షాకింగ్ కామెంట్స్... ?
X
ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య ఉప్పూ నిప్పులాగానే రాజకీయం ఉంటుంది. నీవు ఒకటి అంటే నేను పది అప్పచెబుతాను అన్నట్లుగానే రెండు పార్టీలలో నేతలు ఉంటారు. ఎవరూ ఏదీ బకాయిగా  దాచుకోరు. పైగా ఒక పార్టీ గాలి మరో పార్టీ తీసేసుకోవాలంటే వారికి వారే సాటి. ఏపీలో టీడీపీ పని అయిపోయింది అని వైసీపీ నేతలు మాటకు వస్తే హాట్ హాట్ గా కామెంట్స్ చేస్తారు. చంద్రబాబుతో టీడీపీని ఏం కాదని, ఆ తరువాత పార్టీకి ఎవరు దిక్కని కూడా తెగ వెటకారం ఆడతారు.

అయితే ఇలాంటి వెటకారాలకు ధీటుగా ఎంతో మంది జవాబు చెప్పినా విజయన‌గరం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ యువ నేత కిమిడి నాగార్జున ఇచ్చిన రిటార్ట్ మాత్రం తమ్ముళ్లను తెగ ఖుషీ చేస్తోంది. అదే టైమ్ లో ఆయన అన్న మాటలతో వైసీపీ నేతలకు గట్టి షాక్ తగిలింది అంటున్నారు. ఇంతకీ నాగార్జున ఏమన్నారు అంటే టీడీపీలో నాయకత్వ సంక్షోభం ఉందని తెగ చంకలు గుద్దుకుంటూ ఉత్తిత్తి ఆనందాన్ని అనుభవిస్తున్న వైసీపీ నేతలు తమ పార్టీ గురించి ముందు తెలుసుకోవాలని చెప్పారు.

అదే విధంగా తమకు చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నారని, ఆయన తరువాత పార్టీని లీడ్ చేయడానికి యువ నేత లోకేష్ బాబు ఉన్నారని నాగార్జున చెప్పుకొచ్చారు. అదే వైసీపీకి జగన్ కనుక బెయిల్ రద్దు అయి జైలుకు వెళ్ళిపోతే నాయకుడు ఎవరున్నారని గట్టిగానే ప్రశ్నించారు. మీకు నాయకులు లేరని, వైసీపీ ఈ విషయం ఆలోచించుకోవాలని, ఊరకే తమ మీద కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు.

ఇటీవల విజయన‌గరం జిల్లా టూర్ లో మంత్రి అనిల్ కుమార్ టీడీపీకి నాయకత్వ సమస్య ఉందని చేసిన్స్ దానికి నాగార్జున ఇలా కౌంటర్ వేశారు. మొత్తానికి టీడీపీని ఏదో  ఒకటి అన్నామని తెగ  సంబరపడుతున్న వైసీపీ నేతలకు నాగార్జున ఇచ్చిన ఈ షాక్ స్ట్రాంగ్ గానే తగిలింది అంటున్నారు.

అంతే కాదు ఈ మధ్య అంతా మరచిపోయిన జగన్ బెయిల్ రద్దు వ్యవహారాన్ని కూడా ఈ యువనేత ముందుకు తేవడం ద్వారా ఫ్యాన్ పార్టీలో కొత్తగా కలవరం రేకెత్తించారు అని అంటున్నారు. మరి నిజంగా నాగార్జున అన్నట్లుగానే జగన్ బెయిల్ రద్దు అవుతుందా. లేక కావాలని  విమర్శ చేయాలని టీడీపీ తమ్ముడు చేశాడా అన్నదే ఇపుడు వైసీపీలో చర్చట.