Begin typing your search above and press return to search.

జ‌లీల్ ఖాన్‌... ఈసారి మెట్రిక్ లో ఎంపీసీ

By:  Tupaki Desk   |   18 April 2017 10:14 AM GMT
జ‌లీల్ ఖాన్‌... ఈసారి మెట్రిక్ లో ఎంపీసీ
X
ఒక్క అజ్ఞానం మాట‌తో చేతికందాల్సిన మంత్రి ప‌ద‌విని పోగొట్టుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ మ‌రోసారి త‌న నాలెడ్జిని బ‌య‌ట‌పెట్టుకున్నారు. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో ఆయన బీకాంలో ఫిజిక్స్ ఉంటుంద‌ని వాదించి ప‌రువు పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఎడ్యుకేష‌న్ కు సంబంధించి త‌న‌కేమీ తెలియ‌ద‌ని నిరూపించుకున్నారాయ‌న‌. ఈసారి ఆయ‌న మెట్రిక్యులేష‌న్ లో ఎంపీసీ చ‌దివాన‌ని చెప్ప‌డంతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై సెటైర్లు పేలుతున్నాయి.

ఓ టీవీ ఛానెల్ తో జలీల్ ఖాన్ మాట్లాడుతూ... తాను అప్ప‌ట్లో మాట్లాడింది వేర‌ని... క్లబ్ చేసి - మిక్స్ చేసి - తాను అననిది అనినట్టు రూపొందించారని ఆరోపించారు. దీంతో ఆయనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి...'అసలు బీకాంలో ఫిజిక్స్ ఉందా?' అని ప్ర‌శ్నించ‌గా... ఆయన సమాధానమిస్తూ అస‌లు తాను అలా అన‌లేద‌ని బుకాయించారు.

అంతేకాదు... దానిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ తాను మెట్రిక్యులేషన్ పాసయ్యాన‌ని, మంచి మార్కులతో సెకెండ్ క్లాస్ లో పాసయ్యానని చెప్పారు. దాంతో హయ్యర్ స్టడీస్ చెయ్యాలనుకోలేదా? అని యాంక‌ర్ అడిగారు. దానికి జ‌లీల్‌.... మెట్రిక్యులేషన్ లో నేను ఎంపీసీ గ్రూపు చదివాను అని చెప్పి వెంట‌నే నాలుక్క‌రుచుకుని, కాదుకాదు.. పీయూసీలో ఎంపీసీ గ్రూపు తీసుకున్నాన‌ని చెప్పారు. ఎప్పుడో 30 సంవత్సరాల కిందటి మాట‌లు ఎవ‌రికి గుర్తుంటాయ‌ని అని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ఇటీవ‌ల రెండు 28లు 64 అన్నారు.. దానిని ఎవరూ పట్టించుకోలేదు...రాష్ట్రానికి ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి...వాటిని పట్టించుకోవాలి అని అంటూ న‌న్ను వెంటాడొద్దు అన్న‌ట్లుగా మాట్లాడారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/