Begin typing your search above and press return to search.

జీహెచ్ ఎంసీలో పోటీపై టీడీపీ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   17 Nov 2020 7:22 PM IST
జీహెచ్ ఎంసీలో పోటీపై టీడీపీ కీలక ప్రకటన
X
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగడంతోనే పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్ సకల అస్త్రాలు సిద్ధం చేసుకొని ఆగమేఘాల మీద షెడ్యూల్ ప్రకటించి డిసెంబర్ 1న పోలింగ్ కూడా పెట్టేసింది. ప్రతిపక్షాలకు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.

గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాజకీయ పార్టీలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ కమిటీలు వేయగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా అదేబాటలో నడిచింది.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించడం విశేషం.. తెలంగాణలో దాదాపుగా తుడుచుకుపెట్టుకుపోయిన టీడీపీ అంతో ఇంతో ఆంధ్రా ప్రాబల్యం ఉన్న హైదరాబాద్ లో ఉనికి చాటుకుంటోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీలో పోటీకి కొందరు టీడీపీ నేతలు ఉత్సాహం చూపుతున్నారు.

ఈ సందర్భంగా ఎల్. రమణ మాట్లాడుతూ టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. నేడో రేపో మా అభ్యర్థులను ప్రకటిస్తాం అని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబే కారణమని ఆ విషయాలను చెబుతూ ప్రజల్లోకి వెళుతామన్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా అనే వార్తలపై రమణ స్పందించారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీచేస్తామని రమణ తెలిపారు.