Begin typing your search above and press return to search.
టీడీపీ - జనసేన ఫైట్.. అక్కడ వైసీపీదే గెలుపు...!
By: Tupaki Desk | 16 Jan 2023 12:00 PM ISTవచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని.. పొత్తు పెట్టుకుని పంతంతో అయినా.. అధికారం చేజిక్కించుకుం టాయని భావిస్తున్న టీడీపీ-జనసేన పొత్తు ఎలా ఉన్నప్పటికీ.. వాటి రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ అనుకూలంగా ఉంటుందని అంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దీనికి కారణం కూడా చెప్పారు. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నా.. పశ్చిమలో మాత్రం ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేదని ఆయనసూత్రీకరించారు.
'జనసేన-టీడీపీనే కాదు.. మరిన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా మాకు ఏం కాదు. మా నియోజకవర్గం విష యానికి వస్తే.. అసలు ఎవరు పోటీ చేస్తున్నారో.. ఆ పార్టీలకే క్లారిటీ లేదు. ముందు ఇది తేలేలోగా.. ఇక్కడ రాజకీయం మారుతుంది. మళ్లీ నేనే గెలుస్తా.. ప్రజలు నాకే ఓటేస్తారు' అని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. మరి ఇంత ధీమా ఆయనకు ఎందుకు వస్తోంది? ఆయన ఎలా చెబుతున్నారు? అనే ప్రశ్నలు సహజం.
దీనికి కారణం.. ఈ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని.. టీడీపీ సీనియర్‌నాయకుడు ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘంటా పథంగా చెబుతున్నారు. నాకు కాకుండా.. ఈటికెట్ ఎవరికీ ఇవ్వరు. నేను ఎలాగైనా ఈటికెట్ దక్కించుకుని.. అసెంబ్లీలో అడుగు పెడతాను.. అని ఆయన చెబుతున్నారు. మరోవైపు.. జనసేన అభ్యర్థి పోతుల మహేష్ దీనికి మించిన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓడిపోయినా.. నేను వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను. పవన్ ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయి. అని ఆయన ప్రకటన చేస్తున్నారు. అంటే.. ఈ రెండు పార్టీల నాయకులు ఒకే టికెట్‌పై కర్చీఫ్ వేసేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ప్రశ్న. రేపు రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని టీడీపీకి ఇచ్చి జనసేన కు ఇవ్వకపోతే.. ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని నర్మగర్భంగా చెబుతున్న వైసీపీ మాజీ మంత్రి.. తన గెలుపు ను రాసిపెట్టుకోవాలని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.