Begin typing your search above and press return to search.
టీడీపీ భూస్థాపితం అయ్యింది..
By: Tupaki Desk | 5 April 2021 5:12 PM ISTఏపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పై, లోకేష్ పై మండిపడ్డారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తో కలిసి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుండి బరిలోకి దిగిన గురుమూర్తిని గెలిపించాలని తిరుపతిలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించిన లక్ష్మీపార్వతి చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు.
నందమూరి తారక రామారావు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన టీడీపీని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కలిసి సర్వనాశనం చేస్తున్నారని , లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి, అవినీతి తో లక్షల కోట్లు సంపాదించాడని లక్ష్మీ పార్వతి ఆరోపణలు గుప్పించారు.
లోకేష్ ఏమి మాట్లాడుతారో అర్థం కాదు. తెలుగు దేశం అభ్యర్థి గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధర తగ్గిస్తామని అంటారు, కనీస అవగాహన కూడా నారా లోకేష్ కి లేదు. నారా లోకేష్ ని చూసి అందరు నవ్వు కుంటున్నారు అని చెప్పారు. అలాగే , కనీస ఓటు బ్యాంకు లేని బీజేపీ మిమే గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు బీజేపీ పరిస్థితి ఉందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. కనీసం ఒక్క సీటు సీటు కూడా గెలవలేని వ్యక్తిని నమ్ముకుని బిజెపి ముందుకు వెళ్లడం పై ఆశ్చర్యంగా ఉందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు
బ్రాహ్మణులకు వంశపారంపర్యంగా కొనసాగించి, ఇచ్చిన హామి నిలబెట్టుకున్నారు సీఎం జగన్. ఇక పులివెందులపై పవణ్ కళ్యాణ్ మాటలు చాలా దారుణం అని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన ఊరు పులివెందుల. అలాంటి ఊరిపై దుర్భాషలాడడం పవన్ కళ్యాణ్ దిగజారుడు తనానికి నిదర్శనం అని అన్నారు. చిరంజీవి ఎన్నడు నోరు జార లేదు, అలాంటి వారికి తమ్ముడు గా ఉన్న నీకు ఎందుకు నోరు దురద అని ప్రశ్నించారు. తిరుమల పవిత్రత పై లేనిపోనివి, పవన్ హిందూ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి హయాంలో కూల్చిన దేవాలయాలపై ఎందుకు నోరు మెదప లేదని ప్రశ్నించారు. అయన మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ఇంకా చిన్న పిల్లోడు కాదు, 60 సంవత్సరాలకు దగ్గర లో ఉన్నాడు అని అన్నారు. అలాగే టీడీపీ భవితవ్యం పై కూడా లక్ష్మి పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని చంద్రబాబు,లోకేష్ కలిసి పార్టీ భూస్థాపితం చేసారు అని, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా టీడీపీని బాగు చెయ్యలేరు.