Begin typing your search above and press return to search.

టీడీపీది అల్ప సంతోష‌మా?

By:  Tupaki Desk   |   8 April 2021 7:00 PM IST
టీడీపీది అల్ప సంతోష‌మా?
X
తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు సంబంధించి.. టీడీపీ జోరుగా ప్ర‌చారం సాగిస్తోం ది. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం గురువారం నుంచి ప్రచార ప‌ర్వంలోకి దిగుతున్నారు. దీంతో మ‌రింత‌గా టీడీపీలో జోష్ వ‌స్తుంద‌ని ఎవ‌రైనా అనుకుంటారు. అయితే.. బాబు ప్ర‌చారానికి దిగుతు న్నారనే రీజ‌న్ కంటే కూడా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప్ర‌చార ప‌ర్వంలోకి అడుగులు వేస్తున్నార‌నే వార్త‌లు ఇప్పుడు టీడీపీ ఓ స్వ‌ల్ప సంతోషానికి దారితీస్తున్నాయి.

తిరుప‌తి బై పోల్‌లో జ‌గ‌న్‌.. సీనియ‌ర్ నేత‌ల‌ను కాకుండా.. ఓ జూనియ‌ర్ అయిన‌.. రాజ‌కీయాల‌కు సంబంధమే లేని ఓ ఫిజియో థెర‌పిస్టు డాక్ట‌ర్ గురుమూర్తిని రంగంలోకి దింపారు. ఈయన రాజ‌కీయాల‌కు కొత్త‌. దీంతో జ‌గ‌నే స్వ‌యంగా తిరుప‌తి ఉప ఎన్నిక తీరు ఎలా ఉండాలి? ప్ర‌చారం ఎలా నిర్వ‌హించాలి? అనే విష‌యాల‌పై నేత‌ల‌కు, మంత్రుల‌కు కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో రెండు ల‌క్ష‌ల మెజారిటీ వ‌చ్చిన నేప‌థ్యంలో ఇప్పుడు దీనిని 3 నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకువెళ్లాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో.. త‌ను కూడా స్వ‌యంగా రంగంలోకి దిగి.. ప్ర‌చారం చేయాల‌ని.. భావించిన ఆయ‌న ఒక‌రోజు షెడ్యూల్ రెడీ చేసుకున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ఇప్పుడు ఈ వార్త‌.. వైసీపీలో కంటే.. టీడీపీలోనే ఎక్కువ‌గా సంతోషం నింపుతోంది. దీనికి రీజ‌న్‌.. ఇంకేముంది.. తిరుప‌తిలో త‌మ దూకుడు త‌ట్టుకోలేక‌.. జ‌గ‌నే ఏకంగా రంగంలోకి దిగి.. ప్ర‌చారం చేయాల్సి వ‌స్తోంద‌ని త‌మ్ముళ్లు అనేస్తున్నారు. ఇక‌, మాజీ మంత్రి దేవినేని ఉమా అయితే.. మ‌రిన్ని అడుగులు ముందుకు వేసి.. త‌మ స‌త్తా అర్ధ‌మైంది కాబ‌ట్టే.. జ‌గ‌న్ మెట్లుదిగి తిరుప‌తికి వ‌స్తున్నార‌ని.. కామెంట్లు చేశారు.

అయితే.. టీడీపీ చూపిస్తున్న అల్ప సంతోషంపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు స‌టైర్లు వేస్తున్నారు. ఇంత అల్ప సంతోషం ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. చంద్ర‌బాబుకు ఎంతో ప్ర‌జాద‌ర‌ణ ఉంది. అయితే.. ఇప్పుడు మాత్రం కేవ‌లం కేడ‌ర్ బేస్డ్ పార్టీ అయింద‌ని.. ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌కే ఇంత చ‌ర్చ‌, సంతోషం ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, టీడీపీ సీనియ‌ర్లు కూడా ఇదే విష‌యాన్ని పేర్కొంటున్నారు. గ్రౌండ్ లెవిల్లో తిరిగి.. ప్ర‌జాద‌ర‌ణ పొందేందుకు ప్ర‌య‌త్నించాల‌ని.. చిన్న చిన్న వ్య‌వ‌హారాల‌కే సంతోషం వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని.. అంటున్నారు. మ‌రికొంద‌రు.. ``మ‌న లాగే.. జ‌గ‌న్ కూడా ప్ర‌చారం చేస్తున్నారు`` దీనిని బూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు.