Begin typing your search above and press return to search.

సీఎం విశాఖలో కూర్చుంటే టీడీపీ హ్యాపీయా... ఎందుకు?

By:  Tupaki Desk   |   26 March 2022 5:28 AM GMT
సీఎం విశాఖలో కూర్చుంటే టీడీపీ హ్యాపీయా... ఎందుకు?
X
'జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా విశాఖపట్నంలో కూర్చుంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి అన్ని ఎక్కువ సీట్లు వస్తాయి' ఇది తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నపుడు భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయి 1200 గజాలు అంతకంటే ఎక్కువ స్ధలమున్న వాళ్ళంతా భయపడిపోయారట.

ఇపుడు జగన్ కూడా వెళ్ళి పరిపాలనా రాజధాని పేరుతో విశాఖపట్నంలో కూర్చుంటే మిగిలిన వాళ్ళు కూడా భయపడిపోతారట.

తమకు జగన్ తొందరగా వెళ్ళి వైజాగ్ లో కూర్చోవటమే కావాల్సింది అని లోకేష్ చెప్పారు. అంటే విశాఖను పరిపాలనా రాజధానిగా లోకేష్ యాక్సెప్ట్ చేస్తున్నట్లే లెక్క. మరి జగన్ చేయాలని అనుకుంటున్నది, లోకేష్ ఆశిస్తున్నది ఒకటే అయినపుడు ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు చంద్రబాబునాయుడు ఓకే చేసేస్తే సరిపోతుంది కదా. ఎంచక్కా జగన్ వైజాగ్ వెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి మెజారిటీ సీట్లు వచ్చేస్తాయి.

విశాఖను జగన్ పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసుకోవడం వల్ల టీడీపీకి చాలా మేలు జరుగుతుందని లోకేష్ చెప్పారు. మరి జగన్ వల్ల తమకు ఇంత మేలు జరుగుతుంటే ఎందుకని పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను టీడీపీ వ్యతిరేకిస్తున్నదో అర్ధం కావటం లేదు. ఉత్తరాంధ్రలో 34 సీట్లున్నాయి.

ఇందులో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్నది 6 సీట్లు మాత్రమే. టీడీపీ చరిత్రలోనే ఇంత తక్కువ సీట్లు గెలుచుకున్నది మొన్నటి ఎన్నికల్లోనే.

వచ్చే ఎన్నికల్లో ఇది తారుమారు అవుతుందని టీడీపీ భావిస్తోంది. జగన్ ప్రతిపాదన వల్ల టీడీపీ పుంజుకుంటుందని లోకేష్ భావిస్తున్నపుడు ఇక అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మూడు రాజధానులకు ఓకే చెప్పేస్తే టీడీపీకి ఇంక అంతా శుభమే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. కాబట్టి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను లోకేష్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది.