Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో వైసీపీ వ్యూహానికి టీడీపీ దొరికిపోతోందా?

By:  Tupaki Desk   |   24 March 2022 9:16 AM IST
అసెంబ్లీలో వైసీపీ వ్యూహానికి టీడీపీ దొరికిపోతోందా?
X
ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. దీనిలో పాల్గొని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప‌ట్టుబ‌ట్టి.. ప్ర‌భుత్వం నుంచి స‌మాధానాలు రాబ‌ట్టాల్సిన టీడీపీ స‌భ్యు లు మాత్రం స‌భ‌లో ఆందోళ‌న చేస్తున్నారు. దీంతో స‌భ నుంచి వారిని స‌స్పెండ్ చేసే ప‌రిస్థితి వ‌స్తోంది. అయితే.. స‌భ‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. టీడీపీ స‌భ్యులు త‌ప్పు చేస్తున్నార‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తుం డ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా టీడీపీ అభిమానులు, సానుభూతి ప‌రులు కూడా ఇలా చేయ‌డం మంచిది కాద‌ని అంటున్నారు.

ఏదైనా ఉంటే.. చ‌ర్చించేందుకు అవ‌కాశం ఉంటుంది. అంతేత‌ప్ప‌.. స‌భ‌ను పూర్తిగా గంద‌ర‌గోళంలోకి నెట్టే య‌డం వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం.. అంటున్నారు.. ఇక‌, ఈ క్ర‌మంలోనే స‌భ‌లో స్పీక‌ర్ అనుస‌రిస్తున్న విధానాన్ని కూడా ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌డం లేదు.

ఆయ‌న చాలా వ‌ర‌కు అవ‌కాశం ఇస్తున్నార‌ని.. ఎంతో ఓర్పుగానే ఉన్నార‌ని.. ఉత్తుత్తినే వారిని స‌స్పెండ్ చేసేయ‌డం లేద‌ని.. కూడా అంటున్నారు. ఈ స‌మ‌యంలో త‌ప్పు టీడీపీ నేత‌ల‌వైపే ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.. ఎంతో సీనియ‌ర్లు, మ‌రెంతో అనుభ‌వం ఉన్న బుచ్చ‌య్య చౌద‌రి, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప వంటివారు కూడా సంయ‌మ‌నం కోల్పోవ‌డం స‌రికాద‌ని చెబుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు కావాల‌నే ఇలా చేయిస్తున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కొంత సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించి.. స‌భ‌కు టీడీపీ స‌భ్యులు స‌హ‌క‌రించేలా చేయాల‌ని.. ప‌లువురు సూచిస్తున్నారు.గతంలో వైసీపీనేతలు ఆందోళ‌న చేసినప్పుడు..ఎలా అయితే.. స‌భ ఇబ్బంది ప‌డిందో ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు.

పైగా టీడీపీకి కీల‌క‌మైన స‌మ‌యం ఉంద‌ని.. ఈ స‌మ‌యంలో ఒకింత ఓర్పుగా వ్య‌వ‌హ‌రించి.. స‌భ‌లో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నాలు చేస్తే.. ఆటోమేటిక్‌గ‌గా ప్ర‌భుత్వ ప‌క్ష‌మే.. ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని.. అంటున్నారు.

సాధార‌ణంగా.. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ప్ర‌తిప‌క్షాన్ని అణ‌గ‌దొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఈ స‌మయంలో ప్ర‌తిప‌క్షం వ్యూహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మారుస్తూ.. అధికార ప‌క్షంపై పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నించాలి. అయితే.. ఈ దిశ‌గా టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అసెంబ్లీలో స‌రైన వాణి వినిపిస్తే.. అది ప్ర‌జ‌లకు చేరుతుంది.

ఎందుకంటే.. ఇది పార్టీ కార్య‌క్ర‌మం కాదు. అసెంబ్లీ ప్ర‌జావేదిక‌. సో.. ఆ దిశ‌గా టీడీపీని బ‌లోపేతం చేసేందుకు బ‌ల‌మైన వాణిని వినిపించేందుకు వ్యూహాలు మార్చుకోఆవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పార్టీ నాయ‌కులు, సానుభూతి ప‌రులు కూడా కోరుతున్నారు. త‌ద్వారా.. ప్రజ‌ల దృష్టిలో టీడీపీకి మంచి మార్కులు ప‌డతాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.