Begin typing your search above and press return to search.

అహ్మద్ పటేల్ నోటీసులపై చంద్రబాబు హడల్?

By:  Tupaki Desk   |   6 March 2020 10:55 AM IST
అహ్మద్ పటేల్ నోటీసులపై చంద్రబాబు హడల్?
X
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఐటీ దాడుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంతో పాటు పలువురు మాజీమంత్రుల నివాసాల్లో దాడులు జరిగాయి. ఏపీ, తెలంగాణలో జరిపిన ఈ సోదాల్లో ఐటీ అధికారుల చేతికి దిమ్మదిరిగే విషయాలు తెలిశాయి. దీంతో లోతుగా విచారణ చేసి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టాయని గుర్తించామని ఐటీ అధికారులు మీడియాకు ప్రకటించారు. అయితే అది అధికారిక లెక్కలు మాత్రమే.. దాని సంఖ్య ఎక్కువనే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎంతోమంది ఉన్నారు. చంద్రబాబు మాయాజాలం కదా.. ఆయన అవినీతి దేశమంతటా వ్యాప్తి చెందించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ కోశాధికారి, గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న ఎంపీ అహ్మద్ పటేల్ ఈ వ్యవహారంలో చిక్కుకున్నాడు. దీంతో విచారణకు హాజరుకావాలని గతంలో రెండుసార్లు ఐటీ నోటీసులు అందించింది. విచారణకు వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో అనారోగ్యం నెపంతో ఆస్పత్రిలో పోయి కూర్చుని విచారణ నుంచి తప్పించుకున్నారు. తాజాగా మరోసారి ఐటీ నోటీసులు అందించింది. అయితే నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి. ఇప్పుడు విచారణకు హాజరుకాకుంటే తదుపరి తీవ్ర చర్యలు ఉంటాయని పరోక్షంగా ఐటీ శాఖ హెచ్చరిస్తోంది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ కోసం అహ్మద్ పటేల్ కి అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు అందించారని ఆరోపణలు ఉన్నాయి. ఐటీ అధికారుల చేతికి అమరావతిలో రూ.2,652 కోట్ల పనులకు సంబంధించి ఓ కంపెనీ నాటి ముఖ్య నేతకు అందచేసిన సొమ్ము ఆధారాలు ఐటీకి లభించాయి. దాన్ని ఆధారంగా చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఏపీలో ప్రముఖ వ్యక్తిని త్వరలో ఐటీ అధికారులు విచారించనున్నట్టు సమాచారం. గతనెల బాబు మాజీ పీఏను ఆరు రోజుల‌పాటు విచారించారు. 150 కోట్ల రూపాయలు నగదు తీసుకున్న నాయకుడెవరో ఆధారాలతో సహా రూడీ చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు త్వరలోనే చర్యలు చేపట్టే అవకాశం ఉంది. 150 కోట్ల రూపాయలు తీసుకున్న ఆంధ్రుడు అంటూ గతేడాది నవంబర్ 11వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ద్వారా ఐటీ శాఖ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ వ్యవహారంలో ముంబై కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచే నేరుగా సదరు ప్రముఖ వ్యక్తికి రూ.150 కోట్లు చేరినట్లు ఐటీ సంస్థ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. అమరావతి సిఆర్డీఏ పరిధిలో నిర్మాణ పనులకు ఎంపిక చేసిన మూడు సంస్థలలో ప్రముఖ కంపెనీ. తాత్కాలిక సచివాలయాల నిర్మాణం చేసిన కంపెనీ. వివిధ వర్గాల వారికి 2,652 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన గృహాల సముదాయ నిర్మాణ పనుల్లో మేజర్ కాంట్రాక్ట్ ఈ సంస్థకు ఇచ్చిన అప్పటి ప్రభుత్వం. 20 శాతం చొప్పున ముడుపులు ముట్ట చెప్పే విధంగా ఒప్పందం. ఆ చెల్లింపుల్లో దాదాపు 700 కోట్ల చెల్లించేలా ఒప్పందం. తొలిదశలో 150 కోట్ల రూపాయలు అధికారికంగా చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో సుస్పష్టమవుతోంది.

అయితే విచారణకు అహ్మద్ పటేల్ హాజరవుతే ఆ నిధుల వ్యవహారం పై నోరు విప్పితే చంద్రబాబు పేరు బహిర్గతమవుతాయని టీడీపీలో కలకలం రేపుతోంది. ఆయన నోరు విప్పితే ఆ నిధుల వ్యవహారం లో ప్రధాన పాత్ర చంద్రబాబుదేనని తేలే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే చంద్రబాబును విచారణకు పిలిచే అవకాశం ఉందని సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ వ్యవహారం లో అహ్మద్ పటేల్ ను ఫిబ్రవరి 11 తేదీన జారీ చేసిన సమన్ల ప్రకారం ఫిబ్రవరి 14 తేదీన ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు హాజరు కావాలని కోరారు. అయితే ఆయన 14 తేదీన ఆదాయపు పన్ను ఆధికారుల ముందు హాజరు కాకుండా తప్పించుకున్నారు. దీంతో ఐటీ రెండోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 18 తేదీన విచారణకు హాజరుకావాలని కోరగా ఫరిదాబాద్‌లోని మెట్రో ఆస్పత్రి లో చేరి తాను అనారోగ్యం తో ఉన్నానని చెప్పి విచారణకు హాజరుకాలేని విషయం తెలిసిందే.