Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్ : టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
By: Tupaki Desk | 10 May 2022 12:52 PM ISTతెలుగుదేశం పార్టీలో అయిదేళ్ళ పాటు మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రముఖ నాయకుడు పొంగూరు నారాయణను ఈ రోజు హైదారాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ని చిత్తూరు జిల్లా కోర్టులో హాజరుపరచేందుకు ఏపీకి తరలించారు.
ఇదిలా ఉండగా నారాయణను ఎందుకు అరెస్ట్ చేశారో సీఐడీ పోలీసులు చెప్పలేదు. అదే సమయంలో ఆయన అరెస్ట్ విషయాన్ని స్థానికి పోలీసులకు కూడా తెలియచేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ మధ్య జరిగిన పదవతరగతి పరీక్షలలో కొన్ని ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి.
వాటి మీద ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య తిరుపతిలో జరిగిన జగనన్న విద్యా దీవెన సభలో మాట్లాడుతూ పరీక్షా పత్రాలు టెన్త్ లీకేజికి నారాయణ, చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాలే కారణం అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారే లీక్ చేసి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు అని కూడా అన్నారు.
ఇక దీనికి సంబంధించి ఏపీ పోలీసులు కూడా నిఘా పెట్టి ఉంచారని, తెలుగు ప్రశ్న పత్రం చిత్తూరు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థ నుంచే వాట్సప్ ద్వారా లీక్ అయిందని కూడా చెబుతున్నారు.
దీనికి సంబంధించి నారాయణ విద్యాసంస్థలకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి లీకేజీలో పాత్ర వుందని అనుమానిస్తున్నారు. ఉదయం పరీక్ష ప్రారంభమయిన వెంటనే గిరిధర్ వాట్సప్ నెంబర్ నుంచి తెలుగు ప్రశ్నా పత్రం బయటకు వెళ్ళింది అని కూడా పోలీసులు భావిస్తున్నారు.
ఇక కొద్ది రోజుల క్రితం ఈ కేసులో నారాయణ సంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ తో పాట మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో గత నాలుగు రోజులుగా నారాయణ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి అజ్ఞాతంలో ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఈ రోజు నారాయణ ఇంటికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేయడంతో అతి పెద్ద సంచలనంగా ఈ వ్యవహారం మారింది. మరి నారాయణ అరెస్ట్ ను దేని మీద చేశారో అన్నది పోలీసులు చెబితేనే వివరాలు తెలిసేది అంటున్నారు.