Begin typing your search above and press return to search.
దేశ చరిత్రలోనే తొలిసారి.. ఎవరెస్ట్‌పై టీడీపీ పతాకం.. రెపరెపలు!
By: Tupaki Desk | 9 Oct 2022 5:53 AMతెలుగు దేశం పార్టీ అంటేనే ఆత్మ గౌరవానికి ప్రతీక. తెలుగు దేశం పతాకం అంటే.. అంతకు మించిన అభిమానం. ఈ అభిమానం ఇప్పుడు ఎవరెస్ట్ కి ఎక్కింది. ఏపీకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు.. గింజుపల్లి శివప్రసాద్‌కు టీడీపీ అంటే ఎనలేని అభిమానం. ఆయన పర్వతారోహకుడు కూడా. ఈ క్రమంలో నే ఆయన టీడీపీ పతాకాన్ని పట్టుకుని ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కి.. టీడీపీ పతాకాన్ని ప్రదర్శించారు.
5 వేల మీటర్ల వరకు ఎక్కిన గింజుపల్లి శివప్రసాద్ .. అక్కడ టీడీపీ పతకాన్ని రెపరెపలాడించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. గింజుపల్లిని ప్రశంసించారు. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదన్నఆయన గింజుపల్లి శివప్రసాద్ 80 ఏళ్ల వయసులో కూడా తన అభిమానం చాటుకున్నారని తెలిపారు.
ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల ఎత్తు వరకు అధిరోహించారని, అక్కడ టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించారని వివరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కి అభినందనలు తెలుపుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తాను గతంలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేపట్టానని తెలిపిన చంద్రబాబు... ఆ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేశారని గుర్తు చేసుకున్నారు.
సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారని శివప్రసాద్ ను కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా, ఆ వీడియోలో శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో ఉందని అన్నారు. విజన్ ఉన్న చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకుడిని గెలిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.