Begin typing your search above and press return to search.

అఫీషియ‌ల్‌: టీడీపీలో బిగ్ వికెట్ డౌన్‌

By:  Tupaki Desk   |   13 Sept 2019 5:20 PM IST
అఫీషియ‌ల్‌: టీడీపీలో బిగ్ వికెట్ డౌన్‌
X
ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కొద్దిరోజులుగా తోట త్రిమూర్తులు రాజీనామా అంశం సస్పెన్స్‌ తో నడుస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారంతో ఈ సస్పెన్స్‌ కు ఎట్టకేలకు తెరపడింది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం తన అభిమానులు - కార్యకర్తలతో భేటీ అయిన తాను టిడిపికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రెండున్నర దశాబ్దాలుగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తనను గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆద‌రించార‌ని... తాను ఎప్పుడూ నియోజకవర్గ ప్రజల మనసులను గెలిచినట్టు ఆయన చెప్పారు.

టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు ప్రభుత్వం నుంచి సహకారం లేదని ఆరోపించారు. తన నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణానికి జీవో విడుదల చేసినా కూడ నిధులు మంజూరు చేయలేద‌న్నారు. తాను ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి టీడీపీ ప్ర‌భుత్వం కూడా ఓ కార‌ణం అని తోట తెలిపారు. ఇక నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాల‌ని అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కోరినా ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని తోట విమ‌ర్శ‌లు చేశారు.

వైసీపీలో తోట‌కు ప‌ద‌వి ఫిక్స్‌..

ఇదిలా ఉంటే తోట త్రిమూర్తులు పార్టీ వీడ‌టానికి ముందు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయనతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాను పార్టీ మారాలని తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తోట కుండబద్దలు కొట్టారు. ఎన్నికలకు ముందే తోట పార్టీ మార‌తారన్న ప్రచారం జరిగినా ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ అభ్య‌ర్థి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. రామచంద్రపురం నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా తోట‌కు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మధ్య వైరం ఉంది. ఇప్పుడు తోట వైసీపీ ఎంట్రీకి పిల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తోట వైసీపీ ఎంట్రీకి పిల్లి సుముఖ‌త వ్య‌క్తం చేశాకే... జగన్ ఓకే చెప్పారని సమాచారం. ఇక వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులకు జగన్ తూర్పు గోదావరి జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగించ బోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.