Begin typing your search above and press return to search.

శవ రాజకీయాలంటే ఇదేనా ?

By:  Tupaki Desk   |   17 Aug 2021 5:30 AM GMT
శవ రాజకీయాలంటే ఇదేనా ?
X
శవ రాజకీయాలనే మాటను చాలామంది వింటుంటారు కానీ అదేమిటో తెలీదు. అయితే గుంటూరులో సోమవారం మధ్యాహ్నం ప్రతిపక్షాలు చేసిన రాజకీయం చూసిన తర్వాత శవరాజకీయం అంటే ఏమిటో జనాలకు బాగా తెలిసొచ్చింది. గుంటూరులో బిటెక్ చదువుతున్న రమ్య అనే యువతిని ప్రియుడు కత్తితో పొడిచి చంపేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రేమికుల మధ్య గొడవలు జరగటం ప్రియుడు రెచ్చిపోయి రమ్యను చంపేయటం నిజంగా బాధాకరమనే చెప్పాలి.

సరే ఘటన వెలుగుచూసిన తర్వాత పోలీసులు వెంటనే స్పందించారు. అన్నీవైపులా గాలింపు చర్యలు జరిపి రమ్యను పొడిచి చంపేసిన శశిధర్ ను పట్టుకుని అరెస్టుచేశారు. ఇక ఇపుడు చట్టం, న్యాయం తనపని తాను చేసుకుపోతాయనటంలో సందేహంలేదు. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు రంగప్రవేశం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర నానా గోల మొదలుపెట్టాయి. టీడీపీ, వామపక్షాల నేతల ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు పెద్దఎత్తున ఆందోనలు జరిగాయి.

రమ్య తల్లి, దండ్రులను పరామర్శించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పరిహారంగా రు. 10 లక్షల చెక్కును అందించారు. నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షిస్తారన మంత్రి హామీఇచ్చారు. తర్వాత రమ్య మృతదేహాన్ని తీసుకుని పరమయ్యగుంటలోని తమ ఇంటికి వెళ్ళటానికి తల్లి, దండ్రులు, బంధువులు రెడీ అయ్యారు. మృతదేహాన్ని తీసుకుని ఓ వాహనంలో పెట్టుకున్నారు. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్షాలు వాళ్ళని అడ్డుకున్నాయి.

నిందితుడిని కఠినంగా శిక్షించేదాకా మృతదేహాన్ని ఆసుపత్రి దగ్గర నుండి కదిలించేందుకు లేదని చెప్పాయి. దాంతో చుట్టుపక్కలున్న జనాలు ఆశ్చర్యపోయారు. రమ్య డెబ్ బాడీని ముందుపెట్టుకుని ఆందోళన చేయాల్సిన కుటుంబసభ్యులు, బంధువులేమో ఇంటికి వెళ్ళిపోవటానికి రెడీ అయ్యారు. కానీ ఏ సంబంధంలేని ప్రతిపక్షాలేమో డెడ్ బాడీని కదిల్చేందకు లేదని పట్టుబట్టాయి. కుటుంబసభ్యులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

నిందితుడిని ఎన్ కౌంటర్ చేసేయాలని రమ్య తండ్రి పదే పదే డిమాండ్ చేశారు. కూతురు పోయిన ధుఖంలో తల్లి, దండ్రులు అలా డిమాండ్ చేయటాన్ని అర్ధం చేసుకోవచ్చు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయటం, పరిహారంగా రు. 10 లక్షలను ప్రభుత్వం అందివ్వటంతో తల్లి, దండ్రులు కొంత శాంతించారు. అందుకనే హోంమంత్రి చెప్పిన మాటల మీద నమ్మకంతో కూతురు డెడ్ బాడీని తీసుకుని ఇంటికెళ్ళటానికి రెడీ అయ్యారు.

మరి ఏ సంబంధమూ లేని ప్రతిపక్షాలు డెడ్ బాడీని తరలించటాన్ని అడ్డుకోవటం ఏమిటో అర్ధం కాలేదు. సరే చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టి చివరకు రమ్య మృతదేహాన్ని వాళ్ళ ఇంటికి తరలించేందుకు మార్గం చేశారులేండి. ఇక్కడ విచిత్రమేమిటంటే రమ్య కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నది, ప్రతిపక్షాలడింగిదే ప్రభుత్వం కూడా చేస్తానని హామీఇచ్చింది. అయినా ప్రతిపక్షాలు ఎందుకు గోలచేశాయో ఎవరికీ అర్ధంకాలేదు. ఆసుపత్రి దగ్గర చేరిన జనాలకు శవరాజకీయాలంటే ఏమిటో ప్రతిపక్షాల రాద్దాంతం చూసిన తర్వాత బాగా అర్ధమైంది.