Begin typing your search above and press return to search.

చర్చ సరికాదు.. టీడీపీ సభ్యులకు జగన్ హితవు

By:  Tupaki Desk   |   30 Nov 2020 1:50 PM GMT
చర్చ సరికాదు.. టీడీపీ సభ్యులకు జగన్ హితవు
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో హాట్ హాట్ చర్చ మొదలైంది. ఈ సందర్భంగా బిల్లులు, చర్చల పేరుతో పట్టుబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ హితవు పలికారు.

తొలిరోజు పంచాయితీరాజ్ చట్టసవరణ బిల్లుపై సవివరంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ పూర్తయ్యాకే బిల్లును మండలికి పంపించామని.. అక్కడ కొన్ని సవరణలతో బిల్లు ఆమోదం పొంది మళ్లీ శాసన సభకు వచ్చిందన్నారు. ఇప్పటికే ఈ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగినందున మళ్లీ చర్చ జరపాలని ప్రతిపక్షం కోరడం సరైంది కాదని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో చర్చ జరగకుండానే బిల్లును ఎలా ఆమోదిస్తారంటూ ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.

అయితే జగన్ వారి వాదనను తిప్పికొట్టారు. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమేనని సీఎం జగన్ తెలిపారు.. అయితే ఇది కొత్తగా పెడుతున్నట్లు, వారికి ఏమీ తెలియనట్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు.. ఇప్పుడు మళ్లీ కొత్తగా బిల్లు పెడుతున్నట్లు అభ్యంతరం చెబుతున్నారని ఎండగట్టారు. ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే, ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా వినూత్నంగా ఈ చట్టం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయడం కోసమే ఈ చట్ట సవరణ అని జగన్ తెలిపారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు అని స్పష్టం చేశారు.

చర్చ అనంతరం ఎట్టకేలకు పంచాయితీరాజ్ చట్టం సభలో ఆమోదం తెలిపింది.