Begin typing your search above and press return to search.

ఇసుక మాఫియా పై టీడీపీ చార్జిషీట్

By:  Tupaki Desk   |   12 Nov 2019 7:44 AM GMT
ఇసుక మాఫియా పై టీడీపీ చార్జిషీట్
X
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం మొత్తం ఇసుక చుట్టూనే తిరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రం లో ఇసుక ప్రధాన సమస్య గా మారిన విషయం తెలిసిందే. దీన్ని ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. రాష్ట్రం లో ఈ ఏడాది అనుకున్న కాడికి కొంచెం ఎక్కువ గానే వర్షాలు కురవడం తో నదులన్నీ కూడా నీటి తో నిండి పోయి కనిపిస్తున్నాయి. దీనితో కొన్ని రోజులు ఆగితే మళ్ళీ అందరికి ఇసుక అందుబాటు లోకి వస్తుంది అని ప్రభుత్వం చెప్తుంది. కానీ , ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్రం లో ఇసుక కొరత కి ప్రధాన కారణం ప్రభుత్వమే అని ఆరోపణలు చేస్తుంది.

ఇకపోతే రాష్ట్రం లో ఇసుక దొరకక పోవడంతో పనులులేక కార్మికులు ఆత్మ హత్యలకి పాల్పడుతున్నారు. కార్మికులకు అండగా ..ఇసుక కుత్రిమ కొరత పై రాజకీయ పక్షాల మద్దతు తో 14 న విజయవాడ లో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేయబోతున్నారు. ఈ తరుణంలో జిల్లాల వారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లని టీడీపీ విడుదల చేసింది. మొత్తం గా ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 60 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకుల పేర్లని ప్రకటించి ..వీరి వల్లే రాష్ట్రం లో ఇసుక కొరత ఏర్పడింది అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఇసుక కొరత పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చం నాయుడు మాట్లాడుతూ .. వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారు అని , దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా టీడీపీ ఇసుక అక్రమ రవాణా పై ఆరోపణలు చేయడం లేదు అని తెలిపారు. అలాగే మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా రాష్ట్రం లో ఇసుక కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఎమ్మెల్యే లే అని , వారి ప్రమేయం తోనే ఇసుక రాష్ట్రం దాటి పోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే ప్రభుత్వం ఏమి చేయక పోతే గత 70 ఏళ్ళ నుంచి రాని కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించారు.