Begin typing your search above and press return to search.

టీడీపీ చానెల్స్ డిబేట్స్: ఒకరు దళితుల మీద.. ఇంకొకరు హిందువుల మీద..

By:  Tupaki Desk   |   16 Sept 2020 9:45 AM IST
టీడీపీ చానెల్స్ డిబేట్స్: ఒకరు దళితుల మీద.. ఇంకొకరు హిందువుల మీద..
X
ప్రజాదరణ కంటే.. తమకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు ఆ రెండు చానెల్స్ వ్యవహరిస్తున్నాయట.. రేటింగ్స్ అథ: పాతాళానికి పడిపోతున్నా.. తమ పార్టీని లేపడమే ధ్యేయంగా పెట్టుకున్నాయంట.. ఈ క్రమంలో ఆ రెండు న్యూస్ చానెల్స్ ఇప్పుడు జగన్ పై కక్షగట్టి రెండు బలమైన సామాజిక కోణాల్లో ఆయనను విలన్ ను చేసే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాయట.. మరి జగన్ పై వీరు చేస్తున్న కుట్ర ఏంటి? దాన్నుంచి జగన్ తప్పించుకుంటాడా? లేదా అన్నది జర్నలిస్టు సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీడీపీ అనుకూల చానెల్స్ ఇప్పుడు ఒకటే పనిగా పెట్టుకున్నాయట.. వైసీపీ మరియు జగన్ మీద మాస్టర్ ప్లాన్ వేశారంట.. ఒక చానెల్ ఏమో జగన్ దళిత వ్యతిరేకి అని డిబేట్ పెడుతున్నారు. ఆ చర్చల్లో ఎవరిని బయటివారిని ఎవరినీ తీసుకోవడం లేదు.. ఎవరిని తీసుకొని వస్తున్నారంటే.. ఆల్ రెడీ ఆ చానెల్ స్క్రిప్ట్ ఇచ్చి చదవివే పానలిస్టులనే పట్టుకొస్తున్నారట..

ఇంకొక చానెల్ ఏమో జగన్ మీద హిందూ వ్యతిరేకి అని అని పెద్ద చర్చను పెడుతోంది. వాళ్లు స్క్రిప్ట్ ముందే ఇస్తారంట.. ఇవి ప్రశ్నలు ఉన్నాయని.. మీరు ఇవి సమాధానంగా చెప్పాలని వచ్చే వాళ్లకు చెబుతారట.. గత నెల రోజుల నుంచి ఇదే తంతు ఆ చానెల్స్ పెట్టుకున్నాయని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో ఆ చానెల్స్ డిబేట్స్ లైవ్ లో బాగా ఉండేవి. ఎందుకంటే కొంచెం మంచి టాపిక్స్ పెడుతారు అని టాక్ ఉండేదట. కానీ ఇటీవల ఆ చానెల్స్ పరిస్థితి దిగజారుతోందట.. టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయంట..

ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి.. వాటి మీద పెడితే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని.. కానీ ఈ రెండు రేపే ఎన్నికలు ఉన్నట్టు కులాలు, మతాల మీద విద్వేశాలు రెచ్చగొట్టేలా చర్చలు పెడితే టీఆర్పీ రేటింగ్స్ పడిపోకుండా ఏమవుతుందుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.