Begin typing your search above and press return to search.

గంటా పై అనర్హత వేటు వేయమని టీడీపీ కోరనుందా?

By:  Tupaki Desk   |   14 Nov 2019 8:00 AM GMT
గంటా పై అనర్హత వేటు వేయమని టీడీపీ కోరనుందా?
X
తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ కు పూర్తిగా దూర దూరంగా సాగుతూ ఉన్నారు గంటా శ్రీనివాసరావు. ఆయన అధికారికం గా ఆ పార్టీ ని వీడలేదు. అయితే వీడే ప్రయత్నం లో ఉన్నట్టు గా వార్తలు వస్తున్నాయి. ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చేరవచ్చని వినికిడి.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడానికి గంటా సానుకూలం గానే ఉన్నారట. అయితే వైసీపీ షరతులు పెడుతూ ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, పార్టీ చెప్పిన వ్యక్తిని గెలిపించాలంటూ వైసీపీ నుంచి స్పష్టత వచ్చింది.

అయితే గంటా ఏకం గా పార్టీ మారినందుకు తనకు మంత్రి పదవి కావాలనేంత స్థాయి లో ఉన్నారు. దీంతో ఆయనను వైసీపీ పట్టించుకోనట్టు గా తెలుస్తోంది. అయితే అధికారం లేనిదే గంటా ఉండ లేని పరిస్థితి. అందుకే ఆయన బీజేపీ వైపు చూస్తూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పలువురు బీజేపీ నేతల తో గంటా సమావేశాలు అయినట్టుగా తెలుస్తోంది. అయితే గంటా బీజేపీ తో గట్టిగా చర్చలు జరుపుతూ ఉన్నారని, ఆయన తెలుగు దేశం నుంచి తన వెంట మరి కొందరిని తీసుకొస్తానంటూ కమలం పార్టీ వారికి హామీ ఇస్తున్నారని టాక్ నడుస్తూ ఉంది.

ఏకంగా తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగైదు మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారట గంటా. ఈ నేపథ్యం లో ఆయన చర్యలను చంద్రబాబు నాయుడు ఓ కంట కనిపెడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. గంటా పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నారంటూ, ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ వాళ్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ను కోరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.

అయితే ఒక వైపు తెలుగు దేశం పార్టీ స్పీకర్ ను కూడా అనరాని మాటలు అంటూ ఉంది.ఇలాంటి నేపథ్యంలో ఆయనను కోరి ఎలా నీతులు చెప్పి, అనర్హత వేటు గురించి టీడీపీ వాళ్లు మాట్లాడతారో. తమ హయాంలో అనర్హత వేటు అంశాలను టీడీపీ ఎలా రాజకీయం చేసిందో అందరికీ తెలిసిందే!