Begin typing your search above and press return to search.

ఏపీ మండ‌లిలో బ‌లాబ‌లాలు ఇలా ఉన్నాయ్

By:  Tupaki Desk   |   21 Jan 2020 11:10 AM IST
ఏపీ మండ‌లిలో బ‌లాబ‌లాలు ఇలా ఉన్నాయ్
X
ఏపీ రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ బిల్లు శాస‌న‌మండ‌లికి వ‌చ్చింది. శాస‌న‌స‌భ‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు మండ‌లికి చేరుకుంది. అక్క‌డ ఆమోదం పొందితే ఈ బిల్లు చ‌ట్ట‌రూపం దాల్చ‌నుంది. ఏపీకి మూడు రాజ‌ధానుల‌కు అలా రాజ‌ముద్ర ప‌డ‌నుంది.

అయితే ఇక్క‌డే తిర‌కాసు ఉంది. ఏపీ మండ‌లిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ‌లం లేదు. మండ‌లిలో వైసీపీకి కేవ‌తం 9 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలున్నారు. అలా శాస‌న‌మండ‌లిలో తెలుగుదేశం మెజారిటీ గా ఉంది.

ఇక పీడీఎఫ్ స‌భ్యులు ఐదు మంది ఉన్నారు. వీరు గాక బీజేపీ స‌భ్యులు ఇద్ద‌రు - కాంగ్రెస్ ఒక‌రు - ఇత‌ర ఇండిపెండెంట్ లు ఉన్నారు. ఇలా మండ‌లిలో వైసీపీ మైనారిటీగా ఉంది.

ఈ నేప‌థ్యంలో మండ‌లిలో ఈ బిల్లు ఆమోదం పొందే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ట్టే. అయితే ఏం జ‌రుగుతుంద‌నేది మాత్రం ఆస‌క్తిదాయ‌క‌మే. మండ‌లిలో ఈ బిల్లు ఆమోదం పొంద‌క‌పోయినా.. దాన్ని అమ‌లు చేయ‌డానికి శాస‌న‌స‌భ‌కు అవ‌కాశం ఉంటుంది. మ‌రోసారి స‌భ ఆ బిల్లును ఆమోదించి మండ‌లికి పంప‌వ‌చ్చు. ఆ త‌ర్వాత మూడు నెల‌ల్లో మండ‌లి ఆ బిల్లును ఆమోదించినా, ఆమోదించ‌క‌పోయినా.. అది కార్య‌రూపం అయితే దాలుస్తుంది.

అంత వ‌ర‌కూ వెయిటింగ్ అవ‌స‌రం లేకుండా.. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా ఏపీ ప్ర‌భుత్వానికి ఉంటుంది.