Begin typing your search above and press return to search.
టీడీపీ...బీజేపీ చీలిక మొదలైనట్లుంది
By: Tupaki Desk | 2 Feb 2017 4:00 AM IST రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ - కార్పోరేషన్ ఎన్నికలలో విజయం కోసం అన్ని ప్రతిపక్ష పార్టీలు లోలోన పొత్తుల అన్వేషణను శ్రీకారం చుడుతున్న తరుణంలో అధికార టీడీపీ పయనం ఎటనే దిశగా చర్చలు సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో టిడిపి - బిజెపిలు పాలుపంచుకొన్న ఏపీలోని కొన్ని జిల్లాలో అధికార టిడిపి - బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సందర్భం వచ్చినప్పుడుల్లా బిజెపి నేత - ఎమ్మెల్సీ సోమవీర్రాజు అధికార టిడిపి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంచుమించు మరికొన్ని జిల్లాలలో టీడీపీ - బీజేపీ మధ్య ఇలాంటి సన్నివేశాలే కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మున్సిపల్ - కార్పోరేషన్ ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఒక వేళ టీడీపీని కాదని బీజేపీ ఒంటరిగా వెళ్లితో త్వరలో జరిగే ఈ పెండింగ్ కార్పోరేషన్లలో మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభావం చూపే పరిస్థితులు లేవని రాజకీయ వర్గాల అంచనా. ఇదే జరిగితే మాత్రం ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని చూస్తున్న టీడీపీ నేతలు పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచి దూరమయ్యే పరిస్థితి ఉంటుందని రాజకీయ వర్గాల అంచనా. ఈ పరిణామాలు ఉత్పన్నమైతే ఏపీలో మాత్రం బిజెపి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారుతుందని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. తాము స్వతహాగా అన్ని స్థానాలను ప్రభావితం చేయలేకపోయినా తమతో టిడిపి వస్తే ఆ పార్టీ విజయాన్ని మాత్రం శాసించగలమని బిజెపి నేతలు కొందరు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార - టిడిపి బిజెపి పార్టీలు కలిసే పయనం చేసే అవకాశముంటుందని ఇరు పార్టీలకు చెందిన నేతలు పేర్కొంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలు జతకట్టి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన రాజ్యసభ - ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఆ రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణీని ప్రదర్శించాయి. అయితే ఇటీవల ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకే బీజేపీ - టీడీపీ నేతలు మొగ్గుచూపినా ఈ వ్యవహారంతో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా కొంత దూరం పెరుగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీలు రెండు ధృవీకరిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగే విధంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని ఇరుపార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు కూడా ప్రచారముంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రాష్ట్రంలోని పెండింగ్ లో నున్న కార్పోరేషన్ - మున్సిపల్ ఎన్నికలు టీడీపీ - బీజేపీలకు ప్రతిష్టాత్మకమేననేది కాదనలేని నిజం. ఈ ఎన్నికలు టీడీపీకి ఇంకా ప్రతిష్టాత్మకం అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలోనున్నది టిడిపియే కాబట్టి ఈ ఎన్నికలు ఆపార్టీకే కీలకం అవుతాయని వారు పేర్కొంటున్నారు. అయితే గతంలోనే ఏపీకి ప్రత్యేకహోదా ఇతర అంశాలపై టీడీపీ బిజెపి మధ్య విమర్శల వేడి పెరిగిన విషయాన్ని ఇరుపార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. చివరకు ఎమ్మెల్సీ - రాజ్యసభ స్థానం సైతం బిజెపికి టిడిపి కేటాయించిందని వారు పేర్కొంటున్నారు. అదే సమయంలో టీడీపీపై విరుచుకుపడే సోమవీర్రాజుకు అధికార పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టిందని, అంతా బిజెపి అధినాయకత్వం ఆదేశాల మేరకేనని కొందరు నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. ఇప్పుడు ఎన్ని విమర్శలు కొనసాగినా ఎన్నికల నాటికి పొత్తులు ఇరుపార్టీల మధ్య కుదురుతాయని టిడిపి, బిజెపి నేతలు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నరేళ్ల అనంతరం ఈ ఎన్నికలకు మార్గం సుగమమైంది. సహజంగానే ఈ ఎన్నికలు అధికార పార్టీకి మాత్రం పెద్ద సవాల్‌గానే చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక అంశాలు ప్రభావితం చేసినా కార్పోరేషన్ - మున్సిపల్ ఎన్నికలు అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు ఉంటారు కాబట్టి సహజంగానే ప్రభుత్వ పాలన ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో చూపుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలతోపాటు ఈ ఎన్నికలు మరీ ముఖ్యంగా అధికార పార్టీకి మాత్రం పెద్ద సవాలే అని భావించవచ్చు. అయితే ఈ కార్పోరేషన్ - మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వాల ఒత్తిడితో ఇరు పార్టీలు కలసి ఎన్నికలకు వెళ్లినా ఓట్ల బదిలీ విషయంలో మనస్సులు కలుస్తాయా అన్న సందేహాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజుల కిందట కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి అన్ని డివిజన్లలో ఒంటరిగా పోటీచేస్తుందని తూర్పు గోదావరి జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేసే తమ సత్తా ఏమిటో చాటుతామని టిడిపికి మీడియా ముఖంగా ఆయన సవాల్ విసిరారు. ఇలాంటి పరిస్థితులే ఏపీలో పెండింగ్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగో పలు చోట్ల ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వాల జోక్యంతో ఈ ఎన్నికలు టిడిపి - బిజెపి పార్టీలు కలసివెళ్లినా వారి మధ్య మానసికంగా పెరిగిన దూరం నేపథ్యంలో ఇరు పార్టీల ఓట్లు పొత్తులో భాగంగా సర్థుబాటు అవుతాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/