Begin typing your search above and press return to search.

టీడీపీ నేతల దౌర్జన్యం.. వైసీపీ ఎమ్మెల్యేపై దాడి

By:  Tupaki Desk   |   11 April 2019 3:43 PM IST
టీడీపీ నేతల దౌర్జన్యం.. వైసీపీ ఎమ్మెల్యేపై దాడి
X
గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీడీపీ రెచ్చిపోయింది. వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆయన కారుపై రాళ్ల వర్షం కురిపించారు. రాళ్లు విసురుతూ.. కర్రలతో కొడుతూ వారు గోపిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గోపిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం కాగా.. గోపిరెడ్డికి గాయాలయ్యాయి. చికిత్స చేయించుకున్న అనంతరం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఏజెంట్లను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని.. అందుకే అక్కడి తాను పోలింగ్ బూత్ కు వెళ్లగా టీడీపీ నాయకులు రెచ్చిపోయి తనపై దాడి చేశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి వివరించారు. దీనిపై తాను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

ఇలా టీడీపీ నాయకులు అధికార బలంతో ఏపీ వ్యాప్తంగా దౌర్జన్యకాండలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అడ్డు వచ్చిన వైసీపీ నేతలను కిడ్పాప్ లు చేస్తూ ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. హత్యాకాండలకు కూడా వెనుకాడకపోవడం పరిస్థితిని కళ్లకు కడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కారు మీద దాడి చేసి ఆయనకు కిందకు లాగి మరి కొట్టడం టీడీపీ నేతల దమనకాండకు నిదర్శనంగా చెప్పవచ్చు.