Begin typing your search above and press return to search.

పచ్చబొట్టుగా క్యూఆర్ కోడ్ .. అసలు ట్విస్ట్ ఇదే , ఫాలోవర్లు షాక్ !

By:  Tupaki Desk   |   10 March 2021 11:30 PM GMT
పచ్చబొట్టుగా క్యూఆర్ కోడ్ ..  అసలు ట్విస్ట్ ఇదే , ఫాలోవర్లు షాక్ !
X
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు లేచినప్పటి నుండి పడుకొనే వరకు ఆ సోషల్ మీడియా లోనే కాలం గడిపేస్తున్నారు. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన పేస్ బుక్ , ఇన్‌ స్టాగ్రామ్ లలో ఎక్కువగా ఉంటుంటారు. ఈ సోషల్ మీడియా యాప్స్ లో కొందరికి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. మౌరీసియా గోమెజ్‌ సోషల్ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్‌ గా మంచి గుర్తింపు ఉంది. అతడికి లా లీండ్రా పేరు తో ఇన్‌ స్టాగ్రామ్ ఖాతా ఉంది. ఆ అకౌంట్ కి ఏకంగా 5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఇతడు మెడపై పచ్చబొట్టు వేపించుకున్నాడు. పచ్చ బొట్టు ఈ మధ్య రోజుల్లో చాలా కామన్ కదా అనుకుంటే పొరపాటే .. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసేందుకు మెడ వెనక క్యూఆర్ కోడ్‌ను పచ్చబొట్టుగా వేపించుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే .. గత కొన్ని రోజుల ముందు లా లీండ్రా తన ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో లో తన మెడ వెనక పచ్చబొట్టుతో పొడిపించుకున్న క్యూఆర్ కోడ్ ఉంది. ఓ వ్యక్తి ఆ క్యూఆర్ కోడ్‌ ను స్కాన్ చేసిన వెంటనే స్క్రీన్‌ పై పాపప్ నోటిఫికేషన్ వచ్చింది. దానిపై టచ్ చేయగానే లా లీండ్రా ఇన్‌ స్టాగ్రామ్ పేజీ ఓపెన్ అయింది. దాన్ని చూడగానే అతడి ఫాలోవర్లు ఆశ్చర్యపోయారు. అయితే, కొన్ని వారాల తర్వాత ఓ వార్త బయటకు వచ్చింది. ఆ క్యూఆర్ నిజానికి పనిచేయలేదట.తాను పచ్చబొట్టుగా పొడిపించుకున్న క్యూఆర్ కోడ్ పనిచేయడం లేదని లీండ్రా తన స్నేహితుడైన కార్లోస్ రామోస్ కి భాదపడుతూ చెప్పాడట. దీనితో అసలు విషయం అందరికి తెలిసింది. ఆ పచ్చబొట్టు క్యూఆర్ కోడ్ ఎప్పుడైనా పనిచేసిందా లేక, శరీరంపై పిగ్మెంట్ మారడం కారణంగా అది పనిచేయడం మానేసిందా అని అతడి ఫాలోవర్లు చర్చించుకుంటున్నారు. ఏమైనా మెడపై పచ్చబొట్టుగా క్యూ ఆర్ కోడ్ అంటే సోషల్ మీడియా మైకం ఇతగాడికి ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.