Begin typing your search above and press return to search.

డీల్ ​కుదిరింది.. ఎయిర్​ఇండియాను కొనబోతున్న టాటా గ్రూప్​..!

By:  Tupaki Desk   |   15 Dec 2020 12:12 PM IST
డీల్ ​కుదిరింది.. ఎయిర్​ఇండియాను కొనబోతున్న టాటా గ్రూప్​..!
X
భారీనష్టాల్లో ఉన్న ఎయిర్​ఇండియాను టాటా గ్రూప్​ కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నష్టాల పేరుచెప్పి వరసగా ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేస్తోంది. దేశంలోని ప్రజాస్వామికవాదులు, ఉద్యోగసంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం మొండిగా ముందుకు వెళ్తున్నది. దేశంలోని అన్ని కంపెనీలను ప్రైవేట్ ​పరం చేసేందుకే ఆసక్తి చూపుతున్నది. తాజాగా ఎయిర్​ ఇండియా ను టాటాకు కట్టబెట్టనున్నట్టు సమాచారం.

ఇందు కోసం టాటా గ్రూప్​ బిడ్​ దాఖలు చేసింది. ఈవోఐకు ఇవాళ్టి సాయంత్రం గడువు ముగిసింది. దీంతో టాటా సన్స్‌ చివరి రోజు ఈవోఐ ను దాఖలు చేసింది. ఈ బిడ్‌ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్‌ బిడ్‌ను సమర్పించే అవకాశం ఉంది. అయితే టాటాగ్రూప్​ ఒంటరిగానే కొనుగోలు చేస్తందా.. ఇతర కంపెనీ ల భాగస్వామ్యం తో కలసి వెళ్తుందా అనే విషయం పై క్లారిటీ లేదు. నిజానికి ఎయిర్​ ఇండియా ను స్థాపించింది టాటా గ్రూపే. 1932 లో టాటా గ్రూప్‌ టాటా ఎయిర్‌ లైన్స్‌ ఈ సంస్థ ను ప్రారంభించింది. కానీ 1946లో ఎయిరిండియా గా మారింది. 1953లో ప్రభుత్వం తీసుకున్నది.

దాదాపు 67 ఏళ్ల తర్వాత టాటా గ్రూపే మళ్లీ ఈ సంస్థను కైవసం చేసుకుంటున్నది. మరోవైపు ఎయిరిండియాకు చెందిన 209 మంది ఉద్యోగుల గ్రూప్‌ 51శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చింది. ఈ బిడ్‌కు ప్రస్తుత ఎయిరిండియా కమర్షియల్‌ డైరెక్టర్‌ మీనాక్షీ మల్లిక్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. గతంలోనూ ఎయిర్​ఇండియాను ప్రైవేట్​పరం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏ సంస్థ ముందుకు రాలేదు.