Begin typing your search above and press return to search.

వరల్డ్ టాప్ 50లో ఒకే ఒక్క ఇండియన్ సంస్థ

By:  Tupaki Desk   |   21 Dec 2015 7:18 AM GMT
వరల్డ్ టాప్ 50లో ఒకే ఒక్క ఇండియన్ సంస్థ
X
ప్రపంచంలోని టాప్ 50 సంస్థల్లో ఒకే ఒక్క భారతీయ కంపెనీకి చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ కార్యకలాపాల్లో ముందున్న సంస్థలకు సంబంధించిన టాప్ 50 జాబితా వెల్లడైంది. అందులో భారత్ కు చెందిన టాటా మోటార్స్ కు స్థానం దక్కింది. పారిశ్రామిక పరిశోధనలు - అధ్యయనానికి సంబంధించిన వార్షిక స్కోరుబోర్డును యూరోపియన్ కమిషన్ విడుదల చేసింది... దాని ప్రకారం వోక్స్ వ్యాగన్ సంస్థ ప్రపంచంలో అందరి కంటే ముందుండగా ఇండియా నుంచి టాటా సంస్థకు 49వ స్థానం దక్కింది. మరే ఇతర భారతీయ సంస్థ కు టాప్ 50 లో చోటు దక్కలేదు. కాగా గత ఏడాది టాటామోటార్సు ఈ జాబితాలో 104 వ స్థానంలో ఉండేది. ఈసారి వోక్స్ వ్యాగన్ మొదటి స్థానంలో ఉండగా శాంసంగ్ - మైక్రోసాఫ్టు - ఇంటెల్ - నోవార్టిస్ వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి.

కాగా టాప్ 50 లిస్టులో చోటు సాధించిన ఒకే ఒక్క భారతీయ సంస్థ టాటా మోటార్సు కాగా టాప్ 2500 లిస్టులోనూ భారతీయ సంస్థల సంఖ్య తక్కువగానే ఉంది. కేవలం 26 భారతీయ కంపెనీలే అందులో ఉన్నాయి. టాప్ 2500 లిస్టులో అమెరికా కంపెనీలు 829 ఉన్నాయి. ఇండియా నుంచి ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ - టాటా స్టీల్ - కేడిలా - బజాజ్ ఆటో - హిందాల్కో - విప్రో - టీసీఎస్ వంటి సంస్థలున్నాయి. ఈ జాబితా ప్రకారం చూస్తే ఇండియన్ కంపెనీలు రీసెర్చికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయన్నది ఇట్టే అర్థమవుతుంది.