Begin typing your search above and press return to search.
భారత్ లో మరో వ్యాక్సిన్.. మోడెర్నా లాంచ్ చేస్తున్న టాటా
By: Tupaki Desk | 26 Jan 2021 5:00 AM ISTఇప్పటికే దేశీయంగా తయారైన రెండు వ్యాక్సిన్లు భారత్ లో ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మూడో వ్యాక్సిన్ కూడా రాబోతోంది. దేశంలోకి మోడెర్నా కరోనా వైరస్ టీకాను తీసుకువచ్చేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి మోడెర్నా గ్రూపు సంస్థతో టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ లకు కేంద్రం అత్యవసర వినియోగం కింద అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ మోడెర్నా టీకాకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ ముందుకొచ్చినట్టు సమాచారం.మోడెర్నా టీకాను లాంచ్ చేసేందుకు టాటా హెల్త్ కేర్ 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంస్డ్రీయల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)తో జట్టుకట్టనుందని టాటా గ్రూపు తెలిపింది.
నవంబర్ నెలలో విడుదలైన మోడెర్నా తుది దశ ఫలితాల్లో ఏకంగా 94.1 శాతం సమర్థవంతమైందని వెల్లడైంది. ప్రయోగాల సమయంలో ఎవ్వరికీ ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఇప్పటికే ఈ టీకాను అమెరికా, యూరప్ దేశాలు అనుమతించి పంపిణీ చేస్తున్నాయి. టాటా గ్రూప్ ప్రయత్నాలు ఫలితస్తే భారత్ లో మూడో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుంది.