Begin typing your search above and press return to search.

అమెరికా రోడ్డు ప్రమాదంలో తానా డైరెక్టర్ వాసు ఫ్యామిలీ దుర్మరణం

By:  Tupaki Desk   |   27 Sept 2022 10:21 AM IST
అమెరికా రోడ్డు ప్రమాదంలో తానా డైరెక్టర్ వాసు ఫ్యామిలీ దుర్మరణం
X
అమెరికాలో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదం కృష్ణా జిల్లాలో విషాదం నింపింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డా.నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి (వాసు) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు.

కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామానికి చెందిన డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1995లో ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా వెళ్లాడు. పిడీయాట్రిక్ కార్డియోవాస్య్కూలర్ అనస్థీషియనిస్ట్ గా పనిచేస్తూ హ్యూస్టన్ నగరంలో స్థిరపడ్డాడు. 2017 నుంచి తానా బోర్డు సభ్యుడిగా సేవలందిస్తున్నాడు.

ఇక నాగేంద్ర భార్య వాణి ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వారి ఇద్దరు కుమార్తెల్లో పెద్ద అమ్మాయి వైద్యవిద్యను అభ్యసిస్తోంది. చిన్న కుమార్తె 11వ తరగతి చదువుతోంది.

వీరు ఉదయం 11.30 గంటల సమయంలో కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకువచ్చేందుకు కారులో వాణి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును పికప్ వ్యాన్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భార్య, ఇద్దరు కుమార్తెల మరణంతో డా.నాగేంద్ర బోరుమన్నారు. ఆయనను ఆపడం ఎవరితరం కాలేదు. నాగేంద్ర షాక్ లోకి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై తానా సభ్యులు, శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కు ధైర్యం చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.