Begin typing your search above and press return to search.
వైకాపా సీనియర్ ఆత్మహత్యాయత్నం!
By: Tupaki Desk | 3 Aug 2016 11:08 AM ISTఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జరుగుతున్న పోరు హీటెక్కుతోంది. హోదా అంశంపై ఏపీ ఎంపీలు పార్టీలకు అతీతంగా ఢిల్లీలో నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇక ఏపీలో హోదా అంశాన్ని అస్ర్తంగా చేసుకుని మైలేజ్ పెంచుకునేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగి ఎవరికి వారు నిరసనలు - ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైకాపా మంగళవారం ప్రత్యేక హోదా కోసం ఏపీలో బంద్ నిర్వహించింది. ఈ బంద్ లో పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ప్రత్యేక హోదా కోసం జరిగిన ఆందోళన సందర్భంగా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సంచలనం రేపింది.
ప్రత్యేక హోదాపై బంద్ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత - ఆ పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్ చార్జ్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఆముదాల వలస మునిసిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సీతారాంతో పాటు వైకాపా నాయకులను - కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ కు తీసుకువెళ్లారు. తర్వాత వారిని వదిలేయగా సీతారాం ఇంటికి వెళ్లిపోయారు.
ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత మునిసిపల్ ఆఫీస్ లో కంప్యూటర్ దగ్ధం అయ్యిందని..ఆ కేసులో అరెస్టు చేస్తున్నామంటూ ఆయన్ను మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చినందుకు గాను మనస్థాపానికి గురైన ఆయన అక్కడే ఉన్న బాటిల్ లోని పెట్రోల్‌ను తనపై పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయబోయారు. అయితే పక్కనే ఉన్న వారంతా ఆయన్ను అడ్డుకున్నారు. పోలీసులు ఆయన పట్ల దారుణంగా వ్యవహరించారని వైకాపా నాయకులు మండిపడ్డారు.