Begin typing your search above and press return to search.

స్నేహం ముసుగు.. వివాహితపై గ్యాంగ్ రేపు

By:  Tupaki Desk   |   18 Nov 2019 1:51 PM IST
స్నేహం ముసుగు.. వివాహితపై గ్యాంగ్ రేపు
X
భర్త విదేశాల్లో.. భార్య తమిళనాడులోని గ్రామంలో.. ఇంకేముంది ఆ వివాహితపై కన్నేశాడు ఓ యువకుడు. పరిచయం పెంచుకొని నమ్మించాడు. ఇంటికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన చాక్లెట్ ఇచ్చి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడితోనూ చేయించాడు. ఫొటోలు వీడియోలు తీసి ఆమెను లైంగికంగా రోజూ దోచుకున్నాడు. ఆమె దగ్గర నగలు - డబ్బులు కూడా కాజేశారు. చివరకు భర్త తిరిగివచ్చి గట్టిగా అడగడంతో ఈ బండారం బయటపడింది. నిందుతులు కటకటాల పాలయ్యారు. ఈ ఉదంతం తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లా సాలి గ్రామంలో చోటుచేసుకుంది.

సాలి గ్రామానికి చెందిన ఓ వివాహిత భర్త ఉపాధికోసం గల్ఫ్ వెళ్లాడు. ఒంటరిగా ఉంటున్న మహిళతో అదే గ్రామానికి చెందిన హరీశ్ కుమార్ పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు తన ఇంటికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన చాక్లెట్ తినిపిచ్చి సృహ తప్పాక అత్యాచారం చేశాడు. ఫొటోలు - వీడియోలు తీసి బెదిరించాడు. తన స్నేహితుడి రమేశ్ తోనూ అత్యాచారం చేయించాడు. ఇద్దరూ ఆమెను ప్రతీరోజు లైంగిక అవసరాలకు వాడుకున్నారు. ఇక ఆమె నుంచి నగలు - డబ్బును గుంజారు..

గల్ఫ్ నుంచి వచ్చిన భర్త ఇంట్లోని డబ్బు - మెడలోని నగల గురించి ఆరాతీయగా భార్య చెప్పలేదు. గద్దించి అడగగా విషయం చెప్పి గ్యాంగ్ రేప్ చేస్తున్న కామాంధుల గురించి చెప్పి బోరుమంది.

దీంతో ఆ భర్త పోలీస్ స్టేషన్ లో హరీష్ - రమేష్ లపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.