Begin typing your search above and press return to search.

హెచ్ ఐవీ బాధితురాలి కేసులో సంచలన తీర్పు..! ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యంపై కోర్టు ఆగ్రహం

By:  Tupaki Desk   |   27 Dec 2020 6:10 AM GMT
హెచ్ ఐవీ బాధితురాలి కేసులో సంచలన తీర్పు..! ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యంపై కోర్టు ఆగ్రహం
X
చేయని తప్పుకు హెచ్​ఐవీ బాధితురాలిగా మారిపోయి నరకం అనుభిస్తున్న ఓ మహిళ కేసులో తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సదరు మహిళ బాగోగులన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని ఆదేశించింది. నెలకు రూ. 7500 చెల్లించాలని.. తక్షణ సాయం కింద రూ. 25 లక్షలు అందజేయాలని.. మహిళ పౌష్టికాహారం, వసతి సౌకర్యాలను ప్రభుత్వమే చూసుకోవాలని.. ఆమెకు పక్కా ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది.. హెచ్​ఐవీ పాజిటివ్​ ఉన్న రక్తాన్ని మహిళకు ఎక్కించడంతో ఆమెకు హెచ్​ఐవీ సోకింది. ఏ పాపం చేయని ఆ మహిళ ఇప్పుడు హెచ్ఐవీతో బాధపడుతోంది. హెచ్​ఐవీ బాధితురాలు కావడంతో ఆమెను ఎవరూ పనులకు కూడా పిలవడం లేదు. దీంతోపాటు దుర్భర జీవితాన్ని గడుపుతున్నది.

అయితే చేయని పాపానికి సదరు మహిళ ఇలా అవస్థ పడుతుండటాన్ని చూసి కొందరు వ్యక్తును ఆమె పరిస్థితిని కోర్టుకు వివరించారు. స్పందించిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా సత్తూర్‌కు చెందిన ఓ మహిళ 2018లో గర్భిణిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించుకున్నది. ఆమెకు శరీరంలో రక్తం తక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు రక్తం ఎక్కించారు. అయితే అది హెచ్​ఐవీ పాజిటివ్​ రక్తం. దీంతో ఆమెకు హెచ్​ఐవీ వచ్చింది.

ఆ రక్తాన్ని ఓ వ్యక్తి దానం ఇవ్వగా ప్రభుత్వ ఆస్పత్రి సేకరించింది. రక్తం దానం చేసేటప్పుడు అతడికి కూడా హెచ్​ఐవీ వచ్చినట్టు తెలియదు. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ అని తేలింది. దీంతో సదరు వ్యక్తి ఆ ఆస్పత్రికి సమాచారం కూడా ఇచ్చాడు. అయినప్పటికి ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యం వహించాయి. ఆ రక్తాన్ని అక్కడి నుంచి తీసేయలేదు. అంతేకాక దానిపై హెచ్ఐవీ పాజిటివ్​ అనే స్టిక్కర్​ అంటించలేదు. ల్యాబ్​ టెక్నిషియన్​ చేసిన ఈ తప్పుకు మహిళ జీవితం సర్వ నాశనం అయ్యింది.స్వచ్చంద సేవాసంస్థలకు చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది.