Begin typing your search above and press return to search.

కుర్చీ ఫైట్: తమిళనాట వేడెక్కుతున్న రాజకీయం..

By:  Tupaki Desk   |   6 Oct 2020 3:00 PM IST
కుర్చీ ఫైట్: తమిళనాట వేడెక్కుతున్న రాజకీయం..
X
తమిళనాడు రాజకీయాల్లో అమ్మ జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడింది. ముఖ్యంగా అధికార అన్నాడీఎంకేలో శశికళ జైలు పాలు కావడంతో శిష్యులు ఫళని స్వామి , పన్నీర్ సెల్వంలు రాజీ కుదుర్చుకొని కుర్చీ పంచుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతున్నారు.

అయితే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందర అన్నాడీఎంకే పార్టీలో ముసలం మొదలైంది. ఆ పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. సీఎం పదవి కోసం ఫళని స్వామి, పన్నీరు సెల్వం మధ్య పోటీ నెలకొంది. మొదటికే మోసం తెచ్చి అదును కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థులకు లాభం చేకూర్చేలా ఉంది.

7వ తేదిన అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన విడుదలవుతుందని ఆ పార్టీ అధిష్టాన వర్గాలు చెప్పాయి.అయితే ఇద్దరు మంత్రులు మాత్రం సీఎం ఫళనిస్వామియే తదుపరి సీఎం అంటూ ప్రకటించడం మరోసారి అగ్గిరాజేసింది.

అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఫళని, పన్నీర్ వర్గాలు విడిపోయి సీఎం సీటు కోసం తగాదాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పన్నీర్ సెల్వం సెపరేట్ గా మీటింగ్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సీఎం అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఫళని పట్టుబడుతున్నారు.

అయితే ప్రతిపక్షమైన డీఎంకేకు రోజురోజుకు తమిళనాట ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఈసారి డీఎంకేదే విజయం అంటున్నారు. స్టాలిన్ దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే మరోసారి అధికారంలోకి రావడం కష్టమంటున్నారు. విభేదాలు మాని అధికారం కోసం కలిసి పనిచేయాల్సిన ఫళని, పన్నీర్ కొట్టుకుంటుండడగా.. డీఎంకే మాత్రం అధికారమే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఇప్పుడు శశికళ రాకతో ఫళని, పన్నీర్ లు కూడా అన్నాడీఎంకేలో కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది.