Begin typing your search above and press return to search.
చర్చల్లో శశికళ, అన్నాడీఎంకే.. మధ్యవర్తి బీజేపీ!
By: Tupaki Desk | 24 Sept 2020 8:00 AM ISTవచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి. అధికార అన్నాడీఎంకేను మరింత బలోపేతం చేసేందుకు దాని మిత్రపక్షమైన బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే అన్నాడీఎంకే నుంచి వెలివేయబడి జైలు పాలైన జయలలిత నెచ్చలి శశికళను చేరదీయాలని చూస్తోంది. అన్నాడీఎంకేకు శశికళకు మధ్య సయోధ్య దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇద్దరి మధ్య బీజేపీ మధ్యవర్తిత్వం వహించనుందని సమాచారం.
రెండు రోజుల కిందట శశికళ మేనల్లుడు.. ఏఎమ్ఎమ్ కే పార్టీతో బీజేపీ చర్చలు జరుపడం విశేషం. కాగా జనవరి 2021లోపు శశికళ జైలు నుంచి విడుదల అవుతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె మేనల్లుడు దినకరన్ తో బీజేపీ చర్చలు జరుపుతోంది.
చర్చలు ఫలిస్తే జైలులో ఉన్న శశికళను తొందరగా విడుదలయ్యేందుకు ప్రయత్నిస్తామని దినకరన్ అన్నట్లు సమాచారం. అన్నాడీఎంకే పార్టీలోని సీఎం ఫళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో శశికళ చర్చలు జరుపనుంది. జయలలిత లేని నోటును శశికళతో భర్తీ చేయాలని అన్నాడీఎంకే యోచిస్తోంది.
కాగా జయలలిత చలువతో రెండు సార్లు గెలిచిన అన్నాడీఎంకేకు ఈసారి శశికళ చేరినా గెలుస్తామన్న అంచనాలు లేవు. అందుకే శశికళ కోసం అన్నాడీఎంకే వెంపర్లాడుతున్నట్టు తెలుస్తోంది.