Begin typing your search above and press return to search.

నోబెల్ శాంతి పుర‌స్కారం కోసం మోడీ పేరు!

By:  Tupaki Desk   |   25 Sep 2018 9:54 AM GMT
నోబెల్ శాంతి పుర‌స్కారం కోసం మోడీ పేరు!
X
పార్టీలో కీల‌క నేత‌ల మ‌న‌సుల్ని దోచుకోవ‌టానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ త‌మిళిసాయి సౌంద‌ర రాజ‌న్ చేసిన ప‌ని తెలిస్తే అవాక్కు అవ్వ‌ట‌మే కాదు.. ఆమె తెలివికి మురిసిపోవాల్సిందే. ప్ర‌ధాని మోడీ మ‌నసు దోచుకోవ‌టం అంత తేలికైన సంగ‌తి కాదు. అలాంటి టాస్క్ ను ప్రాధ‌మికంగా స‌క్సెస్ ఫుల్ గా త‌మిళిసాయి పూర్తిచేసింద‌ని చెప్పాలి.

ఇంత‌కూ ఆమె చేసిన ప‌నేమిటంటే.. ప్ర‌ధాని మోడీ పేరును నోబెల్ శాంతి పుర‌స్కారానికి త‌న భ‌ర్త చేత నామినేట్ చేయించిన‌ట్లు చెప్పారు. ఒక ప్రైవేటు యూనివ‌ర్సిటీలో నెఫ్రాల‌జీ విభాగం అధిప‌తిగా.. సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గా ఉన్న త‌న భ‌ర్త సౌంద‌ర రాజ‌న్ సైతం మోడీ పేరును నోబెల్‌కు నామినేట్ చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు.

ఇంత‌కీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌టానికి.. మోడీని ప్ర‌పంచ శాంతి పుర‌స్కారానికి ఎలాంటి ప్రాతిప‌దిక‌న అనే దానికి ఆమె ఇస్తున్న ఆన్స‌ర్ ఏమంటే.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద హెల్త్ కేర్ ప‌థ‌కమైన ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న కింద ఆయుష్మాన్ భార‌త్ ను ప్రారంభించిన నేప‌థ్యంలో తామీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెప్పారు.

2019 నోబెల్ శాంతి బ‌హుమ‌తి నామినేష‌న్ల‌కు జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు గ‌డువు ఉంద‌ని.. ప్ర‌తి ఏడాది సెప్టెంబ‌రులో ఈప్ర‌క్రియ మొద‌లువుతుంద‌ని చెప్పారు. వివిధ వ‌ర్సిటీల‌కు చెందిన ప్రొఫెస‌ర్లు.. ఎంపీల‌తో స‌హా ఇత‌రులు సైతం ప్ర‌ధాని మోడీని నామినేట్ చేయొచ్చ‌న్నారు. మొత్తానికి ప్రొఫెస‌ర్ల‌కు.. రాజ‌కీయ‌నేత‌ల‌కు త‌మిళిసాయి భారీ టాస్క్ నే ఇచ్చిన‌ట్లు క‌నిపించ‌ట్లేదు? మ‌రి.. మోడీ ప‌ట్ల త‌మ‌కున్న విధేయ‌త‌ను ఏ.. ఏ వ‌ర్సిటీప్రొఫెస‌ర్లు.. రాజ‌కీయ నేత‌లు అందిస్తారో చూడాలి.